Green Card: ఇండియాకు మరో షాక్‌ ఇచ్చిన ట్రంప్‌.. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో!

Green Card: ట్రంప్ పరిపాలనలో ఆశ్రయదారుల గ్రీన్ కార్డు ప్రక్రియకు బ్రేక్ పడటంతో, ఇప్పటికే అనుమతులు పొందిన భారతీయులు సహా అనేక మంది తాత్కాలికంగా అర్హత కోల్పోయే అవకాశం ఉంది.

Update: 2025-03-30 04:00 GMT

Green Card: ఇండియాకు మరో షాక్‌ ఇచ్చిన ట్రంప్‌.. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో!

Green Card: అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు ప్రక్రియపై తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ముఖ్యంగా ఆశ్రయం లేదా రిఫ్యూజీ స్టేటస్‌ కోసం దరఖాస్తు చేసిన వారిపై ఇది ప్రభావం చూపుతోంది. తమ దేశాల్లో తాము వేధింపులకు గురవుతున్నామంటూ అమెరికాలో తలదాచుకునే దిశగా ప్రయత్నిస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ప్రభుత్వ పాలనలో ఈ కొత్త ఆదేశాలు అమలులోకి వచ్చాయి. ఇందులో భారతీయులు కూడా ఎక్కువగా ఉండటం గమనార్హం.

2023లో ఏకంగా 51,000 మందికి పైగా భారతీయులు అమెరికాలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేశారు. 2018లో ఇది కేవలం 9,000 మాత్రమే. అంటే ఐదు సంవత్సరాల్లో 466 శాతం పెరుగుదల కనిపించింది. అయితే ఈ మొత్తంలో నిజంగా వేధింపులు ఎదురైనవారు ఎంతమంది? తప్పుడు సమాచారం ఆధారంగా దరఖాస్తులు పెరుగుతున్నాయనే సందేహంతో ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

ఇప్పటికే అనేక రిఫ్యూజీలు అనేక దశల వెరిఫికేషన్, మెడికల్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఆశ్రయ హోదా పొందారు. కానీ ఇప్పుడు వారి గ్రీన్ కార్డు దరఖాస్తుల్ని నిలిపివేయడంతో, వారు మరో ఏడాది వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అసలు అమెరికాలో రిఫ్యూజీగా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం అనుమతించిన తర్వాతే గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేయగలరు. ఇది సాధారణంగా ఆశ్రయం పొందిన తర్వాత 12 నెలల తర్వాతే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియకే తాత్కాలిక విఘాతం ఏర్పడింది. అటు కొత్త ఆదేశాల ప్రకారం, వీసా, పౌరసత్వం, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నవారిని వారి సోషల్ మీడియా అకౌంట్ల ఆధారంగా కూడా చెక్ చేస్తారు. ఇది గుర్తింపు ప్రక్రియను మరింత కఠినతరం చేస్తుంది.

Tags:    

Similar News