
America: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియాలోని స్పాట్సిల్వేనియాలో కౌంటీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్పాట్సిల్వేనియా షెరీఫ్ కార్యాలయప ప్రతినిధి మేజర్ ఎలిజబెత్ స్కాట్ మాట్లాడుతూ వాషింగ్టన్ డీసీకి నైరుతి దిశలో 105కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పాట్సిల్వేనియా కౌంటీలోని ఓ నివాస సముదాయంలో సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగిందని వెల్లడించారు.
ఆ తర్వాత 911 ద్వారా సమాచారం అందిందని..వెంటనే అధికారులు రంగంలోకి దిగి కాల్పులు జరిగిన చోట భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని..కాల్పులు జరిగిన ప్రాంతానికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. గాయపడినవారిని ఆషుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.