Britain: ట్రంప్ దెబ్బతో వణుకుతున్న ప్రపంచదేశాలు.. బ్రిటన్ సంచలన ప్రకటన!
Britain: ప్రపంచ దృష్టంతా ఇప్పుడు ట్రంప్ నిర్ణయాల మీదే. కానీ ఆ ప్రభావం ఫలితాలు చూపించాలంటే.. ఇతర దేశాలు తమ వ్యూహాలను కొత్తగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది. యూకే తాజా ప్రకటన దిశగా తీసుకుంటున్న మార్గం కూడా అందుకు అద్దంపడుతోంది.

Britain: ట్రంప్ దెబ్బతో వణుకుతున్న ప్రపంచదేశాలు.. బ్రిటన్ సంచలన ప్రకటన!
Britain: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన భారీ టారిఫ్‌ల ప్రభావం ప్రపంచం మొత్తం మీద కనిపిస్తున్న వేళ, బ్రిటన్ ప్రభుత్వం కీలక మార్గాన్ని ఎంచుకుంది. యూకే ప్రధాని కియర్ స్టార్మర్ త్వరలో ఓ కీలక ప్రకటన చేయబోతున్నారు. గ్లోబలైజేషన్‌కు తెరపడిన దశ మొదలైందని ప్రకటించబోతున్నారని సమాచారం. సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రారంభమైన గ్లోబలైజేషన్ కాలం ఇక పూర్తయ్యిందని ఆయన చెప్పనున్నారు.
ట్రంప్ ప్రవేశపెట్టిన బేస్‌లైన్ టారిఫ్‌లు అంతర్జాతీయ మార్కెట్లలో స్పష్టమైన అనిశ్చితిని రేపాయి. దీంతో ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య సమీకరణాల్లో బలమైన మార్పులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో యూకే కూడా గ్లోబలైజేషన్‌పై తన దృష్టిని తిరిగి తీసుకురావాలని భావిస్తోంది. స్టార్మర్ ప్రకటనలో, ప్రత్యేకంగా అమెరికా తీరుపై అభిప్రాయాలను వెల్లడించనున్నారని బ్రిటిష్ మీడియా కథనాలు చెబుతున్నాయి.
స్టార్మర్ మాటలలోనూ, ఇటీవల HSBC చైర్మన్ మార్క్ టక్కర్ వ్యాఖ్యలలోనూ ఒకే లక్ష్యం కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు గ్లోబల్ ఎకానమీ నుంచి రీజినల్ బ్లాక్స్ వైపు మారే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే, ఇకపై అంతర్జాతీయంగా కాకుండా, పరస్పర ప్రయోజనాలపై ఆధారపడే చిన్నచిన్న వాణిజ్య బ్లాక్స్ ఏర్పడే అవకాశముంది.
ట్రంప్ గత వారం తాను ప్రకటించిన రెసిప్రోకల్ టారిఫ్‌ల ద్వారా అమెరికా పరిశ్రమను తిరిగి పునర్జన్మ ఇచ్చినట్టు ప్రకటించాడు. ఆయన ప్రకటన తరువాత యూరోప్ ప్రతీకార టారిఫ్‌లతో స్పందించగా, యూకే మాత్రం తక్కువ నష్టంతో బయటపడింది. తమ దేశంపై కేవలం 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ మాత్రమే విధించబడింది.
ఇక స్టార్మర్ ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా భావిస్తున్నారు. ట్రంప్ మాదిరిగా వ్యాపార యుద్ధాలకు ఒడిగట్టడం అవసరం లేదని, దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు సరైన విధానాలతో ముందుకెళ్లవచ్చని ఆయన భావిస్తున్నారు. ప్రత్యేకించి ఉద్యోగవృద్ధికి ఇది బలమైన మార్గమవుతుందని ఆయన అభిప్రాయం.