America News: డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ పదవీ ఊడనుందా? ఆ రోజుకు టైమ్ దగ్గర పడిందా?
America News: లండన్, పారిస్, బెర్లిన్ లాంటి నగరాల్లో కూడా అమెరికా ప్రజాస్వామ్యానికి మద్దతుగా వ్యతిరేక గళాలు మారుమోగుతున్నాయి.

America News: డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ పదవీ ఊడనుందా? ఆ రోజుకు టైమ్ దగ్గర పడిందా?
America News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకి గండం ఉంది. ట్రంప్ నిర్ణయాలతో ఆ వర్గం, ఈ వర్గమని తేడా లేకుండా అమెరికాలో ప్రతీ ఒక్కరూ ఇప్పుడు వీధుల్లోకి వస్తున్నారు. ప్రతీ వీధి తిరుగుబాటుగా మారింది. ప్రతీ రోడ్డు ప్రజల గర్జనలకు వేదికైంది. నోటి నిండా నినాదాలు, కంటినిండా నిరాశ చేతుల్లో ప్లకార్డులు, గుండెల్లో కోపంతో రోడ్లపైకి వస్తున్న నిరసనకారులను చూస్తుంటే ట్రంప్ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. వాషీంగ్టన్ నుంచి లాస్‌ఏంజిలిస్ సిటీ హాల్ వరకు.. న్యూయార్క్ వీధుల నుంచి టెక్సాస్ వరకు ఎక్కడ చూసినా నిరసనల నిప్పులు చిమ్ముతున్నాయి. ఇక అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో వేల సంఖ్యలో జరుగుతున్న నిరసనలకు విదేశాల నుంచి కూడా మద్దతు వెల్లువెత్తుతోంది. లండన్, పారిస్, బెర్లిన్ లాంటి నగరాల్లో కూడా అమెరికా ప్రజాస్వామ్యానికి మద్దతుగా వ్యతిరేక గళాలు మారుమోగుతున్నాయి.
ఇప్పటికే దేశం మొత్తం తిరుగుబాటుతో మునిగిపోయిన వేళ.. ఓ పెద్ద ప్రశ్న ప్రతీ మదిలో వినిపిస్తోంది. ట్రంప్‌ను పదవిలో కొనసాగించాలా? లేదా ప్రజల గళాన్ని గౌరవించి అభిశంసించాలా? మూడు నెలల పాలనతోనే ఈ స్థాయిలో వ్యతిరేకత చెలరేగడం అమెరికా చరిత్రలో అరుదైన విషయంగా చెప్పవచ్చు. ట్రంప్ చీకటి పాలనకు ప్రజలే సమాధానం చెబుతారనే నమ్మకంతో లక్షలాది గళాలు ఒకటై తిరుగుబాటుగా మారుతున్నాయి. ప్రెసిడెంట్ అనే పదానికి గౌరవం ఉండాలి కానీ.. భయం కాదని ప్రజలు చెబుతున్నారు.
పరిస్థితి ఇలానే కొనసాగితే ముందుముందు ఏదైనా జరగవచ్చు. ప్రజాస్వామ్యం తన శక్తిని చూపించే రోజు దగ్గరలోనే ఉండొచ్చు. ట్రంప్ అభిశంసన అనేది ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్..! అయితే అదంత ఈజీ విషయం కాదని గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ హిల్ లాంటి ఘటనలు కూడా గతంలో ట్రంప్‌ను ఏమీ చేయలేకపోయాయి. అందులోనూ ఆయన పదవిలో ఉన్నారు.. ఇటు రిపబ్టికన్ పార్టీ మద్దతు కూడా గట్టిగా ఉంది.. కేవలం డెమోక్రాట్ల సపోర్ట్‌తోనే ట్రంప్‌ను పదవి నుంచి తొలగించడం సాధ్యంకాని పని. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. మరి చూడాలి ట్రంప్ పదవికాలం నాలుగేళ్ల కొనసాగుతుందా లేదా మూడ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా అన్నది ఆయన తర్వాత తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.