Bandar Abbas Port Explosion: ఇరాన్ పోర్టులో భారీ పేలుడు... భారీ సంఖ్యలో మృతులు, వందల మందికి గాయలు

Update: 2025-04-26 11:39 GMT
Bandar Abbas Port Explosion: ఇరాన్ పోర్టులో భారీ పేలుడు... భారీ సంఖ్యలో మృతులు, వందల మందికి గాయలు
  • whatsapp icon

Bandar Abbas Port Explosion: ఇరాన్‌లో భారీ పేలుడు సంభవించింది. రాజధాని టెహ్రాన్‌కు 1000 కిమీ దక్షిణాన ఉన్న బందర్ అబ్బాస్ పోర్టుకు సమీపంలోని ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల ధాటికి కొంతమంది కార్మికులు చనిపోయినట్లు సమాచారం అందుతోంది.  సుమారు 400 మందికిపైనే కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది.

పేలుడు దృశ్యాలు దూరంగా ఉన్న ఒక కారు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు చూస్తేనే ప్రమాదం తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతోంది. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీ నిత్యం ఎగుమతులు, దిగుమతుల ఓడల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో భారీ ఎత్తున పేలుళ్లు జరగడం అంటే ఆ నష్టం భారీగానే ఉంటుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేలపై పేలుళ్లతో మొదలైన పొగ నింగిని తాకిందా అన్నట్లుగా పోర్టు సిటీ మొత్తం వ్యాపించింది.

ఇరాన్ మీడియా వార్తా కథనాలల ప్రకారం తొలుత కంటైనర్ యార్డులో ఈ పేలుళ్లు జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ తరువాత ఈ ప్రమాదం ఆయిల్ రిఫైనరీలో జరిగినట్లు తెలిసింది. గుజరాత్‌లోని కాండ్ల పోర్ట్ నుండి ఇరాన్‌లోని ఈ అబ్బాస్ పోర్టుకు 1475 కిమీ దూరం ఉంటుంది.  

Tags:    

Similar News