America: అమెరికాలో విదేశీ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ట్రంప్..బహిష్కరణపై వెనక్కి తగ్గిన వైట్ హౌస్

Update: 2025-04-26 04:05 GMT
America: అమెరికాలో విదేశీ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ట్రంప్..బహిష్కరణపై వెనక్కి తగ్గిన వైట్ హౌస్
  • whatsapp icon

America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు తనాన్ని నెమ్మెదిగా తగ్గించుకుంటున్నారు. అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు..విదేశీ విద్యార్థులపైనా ఉక్కుపాదం మోసిన విషయం తెలిసిందే. దాదాపు 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ధ హోదాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతోవారు న్యాయస్థానాలను ఆశ్రయించారు. వారికి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కూడా వారి బహిష్కరణలపై కాస్త వెనక్కు తగ్గారు. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను పునరుద్ధరించారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. 

Tags:    

Similar News