Pakistan on India: పాక్ ప్రజల మనసులో ఏముంది? ఉగ్రదాడిపై వారి స్పందనేంటి?
Pakistan on India: ఈ సంస్థ తాలూకు రూట్స్, ఫండింగ్, శిక్షణ - ఇవన్నీ పాకిస్తాన్ ఆధీనంలోని పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతాల నుంచి జరుగుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు.

Pakistan on India: పాక్ ప్రజల మనసులో ఏముంది? ఉగ్రదాడిపై వారి స్పందనేంటి?
Pakistan vs India Pahalgam Pok People Terror Attack Response
Pakistan on India: పర్వతాల మధ్య నిద్రలేని రాత్రిలా.. నిశ్శబ్దంగా ఉన్న పహల్గాం ఒక్కసారిగా అరుపులతో నిండిపోయింది. వణుకు పుట్టించిన పేలుడు తర్వాత అక్కడి గాలి కూడా భయంకరంగా మారింది. పచ్చటి లోయలో విరబూయాల్సిన పచ్చదనం కాస్త నెత్తుటి తడిలో తడిసి ముద్దయింది. దీనికి కారకులు ఎవరు ? అసలు ఎందుకు ఇదంతా చేశారు? ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా అగ్నిగోళంగా ఎందుకు మారింది?
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఈ దాడిలో 26 మంది చనిపోవడం దేశాన్ని ఒక్కసారిగా షాక్‌లోకి నెట్టింది. ఈ ఘటనలో మరణించినవారిలో ఎక్కువమంది పర్యాటకులు. దీనిని ఆర్టికల్ 370 రద్దయ్యాక జరిగిన అతి పెద్ద దాడిగా చెబుతున్నారు. అందుకే ఇది ఒక సాధారణ ఉగ్రదాడి కాదు అన్న భావన ప్రజల్లో మొదలైపోయింది. దీని వెనకదాగి ఉన్న కుట్రల జాడలు ఎక్కడికి తీసుకెళ్తాయో అన్న ఉత్కంఠ ఒక ప్రశ్నగా మిగిలింది. ప్రధాని మోదీ సౌదీ అరేబియాలో పర్యటనలో ఉండగా, ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దేశం అంతా ఒక్కసారిగా ప్రశ్నించడం మొదలెట్టింది. దాడి వెనుక ఉన్నవాళ్లు ఎవరు? భారత్ వారికి టార్గెట్‌గా ఎందుకు మారింది? ఇది నిజంగా ఉగ్రవాదుల ప్లాన్‌నా, లేక రాజకీయంగా మలిచిన ఓ స్క్రిప్టా?
పహల్గామ్ దాడి తరువాత పాకిస్తాన్ నుంచి వచ్చిన స్పందనలు ఆసక్తికరంగా మారాయి. అక్కడ కొన్ని రాజకీయ నాయకులు దాడిని ఖండించినట్టే మాట్లాడారు. కానీ, వెంటనే ఈ దాడికి భారత్ కారణం అని నిందించడాన్ని తప్పుబట్టారు. పాకిస్తాన్ పాలకవర్గం నుంచి వచ్చిన ఈ రకమైన రెస్పాన్స్ వెనుక, చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్కో మనిషి ఒక్కోలా మాట్లాడడం చూస్తుంటే, పాకిస్తాన్‌లో ఎవరికి ఏం స్పష్టంగా తెలుసో? అన్నదే సందేహంగా ఉంది.
అమెరికాలో పాకిస్తాన్‌కు ఒకప్పుడు రాయబారిగా ఉన్న వ్యక్తి ఈ దాడిని గాజా ఘటనకు సమానంగా వర్ణించాడు. ఇది అంతే తీవ్రత కలిగిన సంఘటన అని అన్నాడు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే – ఈ దాడికి పాల్పడింది ఎవరు? ఖచ్చితమైన ఆధారాలున్నాయా? లేక ఎప్పటిలాగే బలమైన రాజకీయ రియాక్షన్లతో, ప్రజల మనసులను ప్రభావితం చేయడమే వారి అసలైన అజెండానా? పాకిస్తాన్ మీడియా మాత్రం గతంలోలాగే భారత్ పైనే బరువు మోపుతుంది. అక్కడి టీవీ యాంకర్లు భారత్... పాకిస్తాన్‌ను టార్గెట్ చేసే చర్యలను తప్పుబడుతున్నారు. కానీ అదే సమయంలో అక్కడి కొంతమంది జర్నలిస్టులు, మేధావులు మాత్రం పాకిస్తాన్ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాలే ఇలాంటి పరిస్థితులకు దారితీస్తున్నాయని అంటున్నారు.
ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ప్రసంగం, అతను మాట్లాడిన విధానం చుట్టుపక్కల దేశాలకు మాత్రమే కాదు, తన దేశంలోని మైనారిటీలకు కూడా ముప్పుగా మారేలా ఉంది. హిందువులు, ముస్లింలు వేరు వేరు అంటూ, పాకిస్తాన్‌కు కశ్మీర్ అవసరం ఏంటి అన్నట్టు మాట్లాడడం దేశంలోని హిందువులకు ఆందోళన కలిగించేలా ఉంది. మత ఆధారంగా ఉన్న ఈ విభజనలో నిజంగా పాకిస్తాన్ ఏమేం కోల్పోతుందో వాళ్లకు తెలుస్తుందా అన్న ప్రశ్న కూడా మిగిలింది.
ఇది కేవలం రెండు దేశాల మధ్య జరగుతున్న మాటల యుద్ధం కాదు. ఇది ప్రజల భద్రత, దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రమాదకరమైన పరిస్థితి. పహల్గాంలో మృత్యువు ముసుగులో ప్రారంభమైన ఈ దాడి ఇప్పుడు అంతర్జాతీయంగా రాజకీయ వాతావరణాన్ని గందరగోళంగా మార్చేసింది. ఆ ముసుగులో అసలు కథ ఇంకా బయటపడ లేదు. పహల్గాంలో రక్తపాతం తర్వాత ప్రారంభమైన రాజకీయ ప్రకంపనలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై మారుమోగుతున్నాయి. భారత్ లోపల ప్రజల ఆగ్రహం ఉప్పొంగుతోంది. దేశం మొత్తం ఉగ్రవాదానికి, దాని వెనకనున్న నేరస్తులకు తగిన శిక్ష ఇవ్వాలనే డిమాండ్‌తో మరిగిపోతోంది. ఈ దాడి వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్న సంస్థ 'కశ్మీర్ రెసిస్టెన్స్ ఫోర్స్' దాదాపు రెండు సంవత్సరాలుగా కశ్మీర్ లో చెలరేగుతున్న చిన్న స్థాయి దాడులకు బాధ్యత తీసుకుంటూ వస్తోంది. ఈ సంస్థ తాలూకు రూట్స్, ఫండింగ్, శిక్షణ - ఇవన్నీ పాకిస్తాన్ ఆధీనంలోని పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతాల నుంచి జరుగుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు.