America Protests: ట్రంప్‌ను వణికిస్తోన్ని పీకాచూ..! భగ్గుమంటున్న అమెరికా
Amrica Protests:: ఈ పికాచూ పోరాట రూపం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. #ProtestPikachu హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.

America Protests: ట్రంప్‌ను వణికిస్తోన్ని పీకాచూ..! భగ్గుమంటున్న అమెరికా
America Protests: పికాచూ నిరసనలకు కొత్త ప్రతీకగా మారిపోయాడు. ఇస్తాంబుల్‌లో పికాచూ కాస్ట్యూమ్‌లో ఉన్న ఓ వ్యక్తి పోలీసుల వెంటాడింపులోంచి తప్పించుకుని పరుగెత్తిన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే అది ఒక్కటే కాదు. ఇప్పుడు అమెరికాలోనూ ఇదే పికాచూ మరోసారి రోడ్డెక్కాడు. ట్రంప్ పాలనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, 'హ్యాండ్స్ ఆఫ్' పేరుతో జరుగుతున్న నిరసనల్లో పికాచూ పాల్గొనడం నిరసనలకు కొత్త ఉత్సాహాన్ని జోడించింది.
న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ వంటి కీలక నగరాల్లో పికాచూ క్యారెక్టర్‌ను ధరించిన ఓ నిరసనకారుడు 'ఎండ్ ఒప్రెషన్' అనే ప్లకార్డు చేతిలో పట్టుకొని నృత్యం చేయడం, పాటలు పాడుతూ జనాల్లో కలిసిపోవడం ఆ ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పికాచూ పోరాట రూపం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. #ProtestPikachu హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇమిగ్రేషన్ విధానాలు, సమాజ సేవ రంగాల్లో విధించిన కోతలు, అలాగే ఎలాన్ మస్క్‌తో కలసి తీసుకున్న కొన్ని వ్యతిరేక నిర్ణయాలపై దేశవ్యాప్తంగా 1,200 పైచిలుకు ప్రదేశాల్లో పెద్దఎత్తున నిరసనలు ఉధృతమయ్యాయి. 'ఇంపిచ్ ట్రంప్', 'హ్యాండ్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ', 'ఎలాన్ మస్క్ యూ ట్రైటర్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి.
ఇక ట్రంప్ పాలనలో గాజా విషయంలో తీసుకున్న వైఖరికి వ్యతిరేకంగా కూడా ఈ ఆందోళనల నుంచి 'ఫ్రీ ప్యాలస్తీన్', 'ఎండ్ ది జెనోసైడ్' వంటి నినాదాలు వినిపించాయి. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ప్రజా ఉద్యమంగా నమోదవుతోంది. కానీ ఈ నిరసనల్లో పికాచూ రూపంలో ఒకానొక నిరసనకారుడి హావభావాలు, ఆత్మవిశ్వాసం ఆందోళనల పక్కన నవ్వులే తీసుకురాగా, ఇది నిరసనకు కొత్త ఉత్సాహాన్ని, క్రియాశీలతను జోడించింది. గళం వినిపించాలంటే దీన్ని అడ్డుకునే శక్తులకంటే ఓ ఐడియా బలంగా ఉంటుందన్న మాట.. ఇప్పుడు మరోసారి నిజమవుతోంది.