Visa Ban: సౌదీ వెళ్లే భారతీయులకు బిగ్‌ షాక్.. భారత్‌తో సహ 14 దేశాల వీసాల నిలిపివేత

Saudi Arabia Banned India Visa: సౌదీ వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింంది. సౌదీ యువరాజు 14 దేశాలకు సంబంధించిన వీసాలను తాత్కాలికంగా నిషేధించారు .

Update: 2025-04-06 13:07 GMT
Saudi Arabia Banned India Visa

Visa Ban: సౌదీ వెళ్లే భారతీయులకు బిగ్‌ షాక్.. భారత్‌తో సహ 14 దేశాల వీసాల నిలిపివేత

  • whatsapp icon

Saudi Arabia Banned India Visa: ఉమ్రా, వ్యాపారం లేదా కుటుంబ వీసాలతో సౌదీ అరేబియా వెళ్లే ప్రయాణికులకు యువరాజు సల్మాన్ బిగ్ షాక్ ఇచ్చాడు. భారత్‌తో పాటు 14 దేశాలలో వీసాలను తాత్కాలికంగా నిలిపివేశాడు. కొన్ని సున్నిత అంశాల నేపథ్యంలో భారత్ పేరు కూడా ఈ జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ వార్త ఛానల్ వెలువడింది. అయితే దీనికి అసలైన కారణం ఇంకా తెలియ రాలేదు కానీ హజ్‌ ప్రారంభానికి ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారత్‌తోపాటు ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈజిప్ట్, ఇరాక్, నైజీరియా, అల్జీరియా, సుడాన్, జోర్డాన్, ఇథియోఫియా దేశాల వీసాలను తాత్కాలికంగా సౌదీ నిలిపివేసింది. అయితే దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని సౌదీ అరేబియా అధికారులు చెబుతున్నారు. మొదటిది అనధికార వ్యక్తులు హజ్‌లో పాల్గొనడం మల్టీ ఎంట్రీ వీసాలపై వచ్చి అక్కడ చట్టవిరుద్దమైన పనులు చేయడం. భక్తుల భద్రత కారణంగా వీసాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక రెండో కారణం వ్యాపారం, కుటుంబ వీసాల నేపథ్యంలో అనుమతి లేకుండానే సౌదీలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక రంగంలో సమస్యలు పెరుగుతున్నాయి.అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హజ్ సమయంలో యాత్రికుల భద్రతా నేపథ్యంలో ఈ తాత్కాలిక నిషేధం విధించినట్లు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ప్రయాణికులు కూడా కచ్చితమైన నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేసింది. అయితే సౌదీ అరేబియాలో హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ యాత్రికుల సౌలభ్యం మేరకు 16 భాషల్లో డిజిటల్ గైడ్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్‌ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News