Pahalgam Attack: పాకిస్థాన్ రెడీగా ఉంది... భారత్‌తో యుద్ధంపై పాక్ రక్షణ శాఖ మంత్రి ప్రకటన

Pakistan Defence minister Khawaja Muhammad Asif: పహల్గాం ఉగ్ర దాడి ఘటన తరువాత తమ దేశంపై ప్రతీకార దాడి చేసేందుకు భారత్ రగిలిపోతోందని పాకిస్థాన్ నేరుగానే చెబుతోంది. తాజాగా పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ పాకిస్థాన్ పై భారత్ దాడికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాక్ మిలిటరీ ప్రభుత్వానికి చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ బలగాలను రంగంలోకి దించినట్లు రక్షణ శాఖ మంత్రి చెప్పారు. భారత్ ఎలాంటి దాడి జరిపినా, దానిని ఎదుర్కునేందుకు పాకిస్థాన్ అప్రమత్తంగా ఉందని ప్రకటించారు. పాక్ మనుగడకు ప్రమాదం ఉందంటే అవసరమైతే అణ్వాయుధాలను ఉపయోగించేందుకైనా వెనుకాడబోమని ఖ్వాజా అన్నారు.
అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్ తో మాట్లాడుతూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజ ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియా దాడి చేసే ప్రమాదం ఉందన్న సంకేతాల నేపథ్యంలో ఆ దాడిని ఎదుర్కునేందుకు పాకిస్థాన్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది అని ముహమ్మద్ ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు.
భారత్ ను చూసి భయపడుతూనే...
పాక్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు చూస్తోంటే, భారత్ ఏ క్షణం ఎటువైపు నుంచి మెరుపు దాడి చేస్తుందా అని హడలిపోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే, ఇంత భయంలోనూ పాకిస్థాన్ మళ్ళీ భారత్ పై బెదిరింపు చర్యలకు దిగడం ఆపడంలేదు. అందుకే భారత్ జరిపే దాడి భయంకరంగా ఉన్నట్లయితే, తాము అణ్వాయుధాలు ప్రయోగిస్తామని చెబుతోంది.
ఇదిలా ఉంటే మరోవైపు భారత్, పాకిస్థాన్ సరిహద్దుల వెంట పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా నాలుగో రోజు అయిన సోమవారం కూడా పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది.