Iran vs US: వామ్మో.. ట్రంప్ తెగించేశాడు.. సముద్రంలో దెయ్యం.. నిద్రలేస్తే ఇరాన్ పని ఖతమే!
Iran vs US: డియాగో గార్సియాలో B-2 బాంబర్ల మోహరింపు కేవలం యేమెన్ గగనతలానికి కాదు, టెహ్రాన్ అణు కేంద్రాల దిశగా కూడా గంభీర సంకేతమే అనిపిస్తోంది.

Iran vs US: వామ్మో.. ట్రంప్ తెగించేశాడు.. సముద్రంలో దెయ్యం.. నిద్రలేస్తే ఇరాన్ పని ఖతమే!
Iran vs US: ఇండియన్ ఓషన్‌లోని దూరదూరపు దీవి డియాగో గార్సియాలో అమెరికా ఏకంగా ఆరు B-2 స్టెల్త్ బాంబర్లను మోహరించడంపై అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది. అతి ఆధునిక బాంబర్లను హౌతీలపై దాడులకు మాత్రమే ఉపయోగించాలనే ఉద్దేశంతో అమెరికా పంపలేదని, దీని వెనక విస్తృత వ్యూహం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బాంబర్ల మోహరింపు ప్రధానంగా ఇరాన్‌కు బలమైన హెచ్చరికగా తీసుకోవచ్చు.
ఈ బాంబర్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలగడం, ఎలాంటి రాడార్‌కి పట్టించుకోకుండా గమ్యస్థానాన్ని చేరడం. వీటికి మధ్యలో ఫ్యూయల్ కూడా నింపచ్చు. అంతేకాదు, పైలట్లకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో బాంబర్ ఖరీదు దాదాపు రెండు బిలియన్ డాలర్లు.
ఇప్పటికే రెడ్ సీ మీదుగా వెళ్లే అమెరికా వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు చేస్తున్న నేపథ్యంలో, అమెరికా వారిపై వరుసగా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నది. మార్చిలో జరిగిన భారీ దాడిలో 53 మంది హౌతీ మిలిటెంట్‌లు మృతిచెందగా, వందమందికి పైగా గాయపడ్డారు. కానీ హౌతీలు తమ దాడులను ఆపలేదు. గాజా యుద్ధానికి మద్దతుగా ఈ దాడులు చేస్తున్నట్టు వారు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ నేతృత్వంలోని అమెరికా సైన్యం ఈ బాంబర్లను ముందుకు తెచ్చింది. కానీ ఇది కేవలం హౌతీలపై దాడులకే కాదు, ఇరాన్‌ను ఒత్తిడిలో పెట్టేందుకూ అని భావిస్తున్నారు. ఎందుకంటే, ఇరాన్ అణు కార్యక్రమం వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో అమెరికా కొత్త ఒప్పందానికి సిద్ధంగా లేదని చెప్పింది. ట్రంప్ ఇప్పటికే ఖమేనైకి లేఖ రాసి, రెండు నెలల్లో ఒప్పందానికి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవాలంటే, రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ట్రంప్ చెప్పినట్టు సమాచారం ..ఒకటి మిలటరీ యాక్షన్, రెండోది డిప్లమసీ. అయితే B-2 బాంబర్లు తీసుకొచ్చే మెసేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉండటంతో, అవసరమైతే ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా మారే ప్రమాదం ఉంది.