German Navy Head: పదవి ఊడగొట్టిన నోటిదూల

German Navy Head: నావికా దళ చీఫ్ పదవికి రాజీనామా చేయించిన జర్మనీ

Update: 2022-01-24 04:03 GMT

German Navy Head: నోటి దూల ఒకప్పుడు ఎంతో నష్టం కలిగిస్తుంది. నోటిని అదుపులో పెట్టుకోకపోతే పదవులు కూడా ఊడుతాయని మరోసారి నిరూపితమైంది. న్యూఢిల్లీలో మనోహర్ పారేకర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జర్మనీ నేవీ చీఫ్ అచిమ్ షాన్‌బాక్ చేసిన ప్రసంగం ఆయన పదవికే ఎసరు పెట్టింది. వాస్తవానికి ఉక్రెయిన్‌లో చిన్న భూభాగాన్నే రష్యా కోరుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. ఇదంతా చెత్త అన్న ఆయన పుతిన్ కేవలం ఒత్తిడి మాత్రమే పెంచవచ్చన్నారు. పుతిన్ ఐరోపా సమాఖ్యలో అభిప్రాయ భేదాలు సృష్టించగలడన్న విషయం అందరికి తెలుసన్నాడు అచిమ్.

భారత్, జర్మనీలకు రష్యా అవసరం ఉందని అచిమ్ షాన్ బాక్ అన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఈ పెద్దదేశం అవసరం ఉందన్నారు. చైనా నుంచి రష్యాను దూరంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఐరోపా సమాఖ్యలో కీలక భాగస్వామి అయిన జర్మనీ విధానాలకు అచిమ్ వ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. వాస్తవానికి రష్యాతో జర్మనీ సైనిక ఘర్షణ కోరుకోవడం లేదు. దీంతో జర్మనీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. వైస్ అడ్మిరల్ అచిమ్ చేత నావికా దళ చీఫ్ పదవికి రిజైన్ చేయించింది. ప్రసంగించిన కొద్ది గంటల్లోనే అచిమ్ పదవిని కోల్పోవడం చర్చనీయాంశమైంది. 

Tags:    

Similar News