మోడీని పొగిడి.. రాహుల్‌పై సెటైర్లు వేసిన ఒబామా

Update: 2020-11-14 06:46 GMT

ప్రధాని మోడీపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు గుప్పించారు. ఆయనొక ప్రధాన సంస్కర్త అని కొనియాడారు. ఒకప్పుడు తండ్రికి సాయం చేసేందుకు, కుటుంబానికి అండగా ఉండేందుకు టీ‌ అమ్మిన వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడు అని ఒబామా పొగడ్తలు గుప్పించారు. భారత్‌ చైతన్యవంతంగా, సమర్థంగా ఎదిగిందని చెప్పడానికి పేదరికం నుంచి ప్రధానిగా ఎదిగిన మోడీ జీవితమే నిదర్శనమని చెప్పారు.

ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్' పేరుతో ఒబామా పుస్తకం రాశారు. దీనిలో ప్రపంచంలోని వివిధ దేశాల నేతల గురించి ప్రస్తావించారు. 2015లో టైమ్‌ పత్రికకు‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ గురించి ప్రస్తావనను కూడా ఒబామా ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. పేదరిక నిర్మూలన, మెరుగైన విద్య, బాలికలు మహిళల సాధికారత వంటివాటిపై మోడీకి స్పష్టమైన లక్ష్యాలున్నాయని ప్రశంసించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొంటూనే దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కష్టపడుతున్నారని చెప్పారు. ఇక అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురించి కూడా ఒబామా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. రాహుల్‌ది ఆరాటమే గానీ స్పష్టత, ధైర్యం ఆయనలో కనిపించదన్నారు. 

Tags:    

Similar News