#FreeBritney: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫ్రీ బ్రిట్నీ హ్యాష్‌ట్యాగ్
#FreeBritney: ఫ్రీ బ్రిట్నీ స్పియర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ హ్యాష్‌ట్యాగ్ షేక్ చేసేస్తోంది.
#FreeBritney: ఫ్రీ బ్రిట్నీ స్పియర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ హ్యాష్‌ట్యాగ్ షేక్ చేసేస్తోంది. తమ అభిమాన పాప్ సింగర్‌కు ఎన్ని కష్టాలో అంటూ బ్రిట్నీస్పియర్స్‌కు అభిమానులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో ఆమె అభిమానులు ఓ మెగా వార్‌నే నడిపిస్తున్నారు. ఇంతకాలం వరల్డ్ మ్యూజిక్ అవర్స్‌ను ఉర్రూతలూగించిన బ్రిట్నీకి ఏం జరిగింది.? ఇన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్న బ్రిట్నీ ఉన్నట్టుండి ఎందుకు కోర్టు మెట్లెక్కింది.?
వరల్డ్ మ్యూజిక్ లవర్స్‌కు బ్రిట్నీ పేరు పరిచయం అక్కరలేదు. ఆమె మైక్ పట్టుకుంటే స్టేజ్‌లు ద్దరిల్లిపోతాయి. ఆమె గొంతు కోసం వెర్రిత్తిపోయే ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. అలాంటి బ్రిట్నీ స్పియర్స్ కన్నీటీ పర్యంతం కావడమే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఒక్క షోకు దాదాపు 4లక్షల మిలియన్ల డాలర్లు సంపాదించే సెలబ్రిటీకి కష్టాలుంటాయా అంటే ఏమో బ్రిట్నీని చూస్తే ఉంటాయనే చెప్పాలి. గత పదమూడేళ్లుగా పైకి నవ్వుతున్నా అంతర్గంతంగా నరకం అనుభవిస్తున్నా అంటూ బ్రిట్నీ కోర్టుకు మొరపెట్టుకోవడం ఆమె ఫ్యాన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోంది.
2007వ సంవత్సరంలో బ్రిట్నీ తన భర్త నుండి విడిపోయింది. అప్పటి నుంచీ ఆమె బాగోగులను ఆమె తండ్రి జేమ్స్ చూసుకుంటున్నారు. బయట ప్రపంచానికి అంతా బాగానే కనిపించినా బ్రిట్నీస్పియర్స్ మాత్రం 13 ఏళ్ల నిర్భంధం నుంచి బయటపడేయాలని వేడుకుంటుంది. ఒకటీ రెండూ కాదు ఏకంగా 20నిమిషాలపాటు 13ఏళ్ల తన ఆవేదనను బయటపెట్టింది. నా జీవితం నాకిచ్చేయండి నా తండ్రివల్ల నేను ఎప్పుడూ సంతోషంగా లేను నా సంరక్షకుడిగా ఆయన చేసిన మంచికంటే చెడే ఎక్కువ అంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనతో తమ అభిమాన సింగర్‌కు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారు. ఫ్రీ బ్రిట్నీ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.