Former GOP presidential candidate Herman Cain dies : కరోనాకు బలైన అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి
అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి హర్మన్ కేన్ కరోనావైరస్ తో మరణించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. గత కొంతకాలంగా కేన్ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.. చికిత్స కోసం గత నెల అట్లాంటాలోని ఆసుపత్రిలో చేరారు. అయితే ఆరోగ్యం విషమించి కేన్ గురువారం తెల్లవారుజామున అట్లాంటా ఆసుపత్రిలో మరణించారు.కేన్ 2012 లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నారు. ఆయన మృతిపై ట్రంప్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కెయిన్ చాలా వారాలుగా వైరస్ తో అనారోగ్యంగా ఉన్నారు. అయితే ఆయన ఎప్పుడు? ఎక్కడ వ్యాధి బారిన పడ్డారో స్పష్టంగా తెలియలేదు,
కాని జూన్ 20 న ఓక్లహోమాలోని తుల్సాలో జరిగిన ట్రంప్ ప్రచార ర్యాలీకి హాజరైన రెండు వారాల లోపు ఆయన ఆసుపత్రిపాలయ్యారు. ర్యాలీలో తీసిన ఒక ఫోటోలో కైన్ ముఖానికి మాస్కు లేకుండా, పేస్ కిట్ ధరించకుండా ఇతర వ్యక్తులతో దగ్గరగా కూర్చున్నట్లు చూపించింది. జూన్ 29న కేన్ కు COVID కి పాజిటివ్ అని తేలింది. లక్షణాలు తీవ్రంగా ఉన్నందున జూలై 1 న ఆసుపత్రిలో చేరారు. ఇక కేన్ మృతికి పలువురు సంతాపం తెలిపారు.