విమానంలో ప్రయాణం.. ఇకపై వింత అనుభవం!

Update: 2020-05-19 05:26 GMT

ఇకపై విమాన ప్రయాణం అంత వీజీ కాదు. మహమ్మారి దెబ్బకు జర్నీ రూపురేఖలే మారిపోతున్నాయి. పక్కపక్కనే కూర్చోలేం వేడివేడి వంటకాలు దొరకవు, టచ్‌స్క్రీన్లు కనిపించకపోవచ్చు ఒకరకంగా చెప్పాలంటే విమానయానంలో సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్న విషయం ఆసక్తికరంగా మారింది.

విమాన ప్రయాణాల్లో సరికొత్త మార్పులు రాబోతున్నాయా? మునపటిలా విమానాల్లో ప్రయాణించలేమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా నేర్పిన పాఠాలతో అన్నింట్లో కొత్త మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. విమానాలు ఎప్పుడు ఆకాశంలో ఎగిరినా వైరస్‌ వ్యాప్తికి తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

హెల్త్‌ అండ్‌ సేప్‌జర్నీకి అనుగుణంగా ప్రమాణ రూపురేఖలనే మార్చేస్తున్నారు. విమానం ఎక్కితే పక్కపక్కనే కూర్చోకుండా కొత్త సీటింగ్‌ కనిపించనుంది. ముందులా లోపల వేడివేడి వంటకాలు దొరకపోవచ్చు ముందు సీట్లకు వస్తువులుంచే సంచీలుండవు ఎంటర్ టైన్మెంట్‌కు సంబంధించి ఇక టచ్‌స్క్రీన్లు లేకపోవచ్చు, ఇటలీలోని ఓ ప్రముఖ విమాన డిజైన్‌ సంస్థ ఓ సరికొత్త డిజైన్‌ను తెరపైకి తెచ్చింది. విమానాశ్రయాల్లోనూ కొత్త పద్ధతులు సిబ్బందైనా, ప్రయాణికులైనా ఒకరినొకరు తాకే పనిలేకుండా యంత్రాలే అన్ని పనులు చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. విమానం ఎక్కడానికి ముందే ప్రయాణికులు తమ భోజనాలను టచ్‌లెస్‌ వెండింగ్‌ మెషీన్ల ద్వారా కొనుక్కోవాల్సి ఉంటుంది.ఇప్పటికే పలు దేశాల్లో ఈ దిశగా ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి

భౌతిక దూరానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రయాణికులకు భరోసా కల్పించేలా చేపట్టాల్సిన చర్యలపై విమానయాన సంస్థలు దృష్టి పెడుతున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు శానిటైజర్ కూడిన కిట్ తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రాంతాలను అతినీల లోహిత కిరణాలతో శుభ్రంచేసే రోబోలు కూడా సేవలందిస్తాయి. సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా లోపలికి వెళ్లే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ప్రయాణికులకు వారి సమయం వచ్చినప్పుడే ఎయిర్‌పోర్ట్‌ లోపలికి ఎంటర్‌ కావాల్సి ఉంటుంది.

ఇక తీసుకెళ్లే లగేజీలను విమానాల్లోకి ఎక్కించే ముందు యంత్రాలతో వాటంతట అవే శానిటైజ్ కావడం లేదా అతినీల లోహిత కాంతితో క్రిమినాశకంగా తయారయ్యే విధానం కూడా రానుంది. శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకునేందుకు థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు అమర్చనున్నారు. పోర్టోరికోలో థర్మల్ కెమెరాలు పెట్టడంతో పాటు శరీర ఉష్ణోగ్రత 100.3 డిగ్రీలు దాటగానే అలారం మోగుతుంది. ప్రయాణికుల లగేజి శానిటైజ్‌, ఆరోగ్య పరీక్షలు చెకింగ్‌, బోర్డింగ్‌ ప్రక్రియలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం 4 గంటలు ముందుగా ప్రయాణికులు వెళ్లాల్సి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇంతకు ముందు విమానాల్లో ఫస్ట్‌ క్లాస్‌, బిజినెస్‌ క్లాస్‌, ఎకానమీ వంటి ప్రయాణ తరగతులుండేవి. ఇకపై సోషల్‌-డిస్టెన్స్‌-ఫ్రెండ్లీ క్లాస్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో భౌతిక దూరంపై అవగాహన పెరగడంతో ఇతరులకు దూరంగా ఏకాంతంగా కూర్చోవాలని కొందరు భావించవచ్చు. అలాంటివారి కోసం చిన్న గదులతో ఈ 'ఐసొలేషన్‌ క్లాస్‌'లు కూడా రావొచ్చని అంచనా.

Tags:    

Similar News