China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం
China: 17 మంది సజీవ దహనం.. 3 పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు
China: చైనాలో ఓ రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈశాన్య నగరం చాంంగ్‌చున్ ప్రమాదవశాత్తు రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడిన అగ్నికీలల్లో చిక్కుకుని 17 మంది కస్టమర్లు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమై హోటల్ చిక్కుకున్న కస్టమర్లను కాపాడారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. చాంగ్‌చున్ నగరంలోని న్యూ ఇండస్ట్రియల్ జోన్‌లో ఈ సంఘటన జరిగింది. జలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌చున్ ఆటోమొబల్ ఇండస్ట్రీ కేంద్రంగా ప్రఖ్యాతి గాంచింది.
ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియలేదని దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా చైనాలోని తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇటీవల చైనా టెలికాం కంపెనీకి చెందిన ఓ కార్యాలయంలోనూ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. గతేడాది జులైలో ఓ గోదాంలో జరిగిన ప్రమాదంలో 15 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.