Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేలిన పేజర్లు... 9 మంది మృతి, 2,800 మందికి గాయాలు... ప్రతీకారం తీర్చుకుంటామన్న హెజ్బొల్లా

Lebanon Blast: లెబనాన్, సిరియాలపై అనూహ్యకరంగా దాడి జరిగింది. రెండు దేశాల్లో మంగళవారం ఒకేసారి వందలాది పేజర్లు పేలాయి. ఫలితంగా 9 మంది దుర్మరణం చెందారు. 2,750 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక్క సిరియాలోనే 7 మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-09-18 03:51 GMT

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేలిన పేజర్లు... 9 మంది మృతి, 2,800 మందికి గాయాలు... ప్రతీకారం తీర్చుకుంటామన్న హెజ్బొల్లా

Lebanon Blast: లెబనాన్, సిరియాలపై అనూహ్య మెరుపు దాడి జరిగింది. రెండు దేశాల్లో ఒకేసారి వందల పేజర్ల పేలుళ్లు జరిగాయి. ఫలితంగా 9 మంది దుర్మరణం చెందారు. 2,750 మందికి పైగా గాయపడ్డారు. ఒక్క సిరియాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో లెబనాన్‌లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్‌బొల్లా కీలక నేతలు ఉన్నారు. ఈ అనూహ్య దాడి వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

పేజర్లు పేలిన ఘటనలో ఇద్దరు హెజ్‌బొల్లా సభ్యులు మరణించారు. ఒక ఎంపీ కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే ఇరాన్ రాయబారి భద్రతా సిబ్బంది దగ్గర ఉన్న పేజర్ పేలింది. తొలుత పేజర్లు వేడెక్కి ఆ తర్వాత పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో హెచ్‌బొల్లా చీఫ్ నస్రుల్లాకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. చేతులకు, ప్యాంటు జేబుల దగ్గర గాయాలతో లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో ఎంతో మంది పడిపోయారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించాలని లెబనాన్ ఆరోగ్య శాఖ ఆదేశాలను జారీ చేసింది. వైర్‌లెస్ పరికరాలను వినియోగించకూడదని సిబ్బందికి సూచించింది.

పేజర్ దాడుల్లో ఇరాన్ రాయబారి కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ సెల్ ఫోన్లను ట్రాక్ చేసే ప్రమాదం ఉందని వాటి వాడకూడదని హెజ్‌బొల్లా సభ్యులకు ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లా ఆదేశాలు జారీ చేయడంతో హెజ్‌బొల్లా పేజర్లను కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే అవి అనూహ్యంగా పేలిపోవడంతో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య మరింత ఉద్రిక్తతకు కారణం అయ్యింది. చేతిలో పట్టుకునే వీలున్న పేజర్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేల్చివేశారని లెబనాన్ మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. 

Tags:    

Similar News