సంచలన నిర్ణయం ప్రకటించిన బ్రిటన్ ప్రభుత్వం
England Lift Covid Rules: బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
England Lift Covid Rules: బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓవైపు ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తుంటే యూకేలో కొవిడ్ ఆంక్షలను మొత్తం ఎత్తివేసినట్లు ప్రకటించారు ప్రధాని బోరిస్ జాన్సన్. దేశంలో కొవిడ్-19 ఆంక్షలను మొత్తం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇంగ్లాండ్లో మాస్క్ తప్పనిసరికాదు నిబంధన సహా ఇతర కొవిడ్ ఆంక్షలన్నింటికీ ముగింపు పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్..గరిష్ఠస్థాయికి చేరి, తగ్గుముఖం పట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పారని బోరిస్ తెలిపారు. ఒమిక్రాన్ నుంచి బయటపడిన తొలి దేశం తమదే అన్నారు. ఈ నేపథ్యంలో ఇక ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కూడా ఉండదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ పీక్ దశను అధిగమించిందని దేశ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ను మొట్టమొదట అందించింది యూకేనే అని ప్రధాని బోరిస్ ప్రకటించారు.
వేసవిలో చాలా మంది వ్యతిరేకించినా దేశంలో కఠిన ఆంక్షలు విధించినట్లు గుర్తుచేశారు బోరిస్. ఇప్పుడు ఇతర దేశాల్లో లాక్డౌన్ ఉన్నా..తాము అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నామన్నారు. అందుకే జీ-7 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్ అవతరించిందని ప్రధాని బోరిస్ తెలిపారు. యూకేలో మొత్తం 5 కోట్ల 20 లక్షల మందికిపైగా టీకా తొలి డోసును పొందగా 4 కోట్ల 79 లక్షలకుపైగా టీకా రెండు డోసులను తీసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 3 కోట్ల 65 లక్షల మంది బూస్టర్ డోసును కూడా తీసుకున్నారు.