Ectolife: ఫ్యాక్టరీలో పిల్లల ఉత్పత్తి.. మానవ ప్రయోగాల్లో కీలక ముందడు..

Ectolife: సృష్టికి ప్రతిసృష్టి.. మహిళల అవసరం లేదిక.. యంత్రాల ద్వారా బిడ్డకు జన్మ.

Update: 2022-12-19 05:33 GMT

Ectolife: ఫ్యాక్టరీలో పిల్లల ఉత్పత్తి.. మానవ ప్రయోగాల్లో కీలక ముందడు..

Ectolife: సృష్టికి ప్రతిసృష్టి.. మహిళల అవసరం లేదిక.. యంత్రాల ద్వారా బిడ్డకు జన్మ. ఒకరు, ఇద్దరు కాదు. జస్ట్ ఏడాది కాలంలోనే 30వేల మంది పిల్లలను కనేయొచ్చు. సారీ, సారీ కనడం కాదు. ఉత్పత్తి చేసేయొచ్చు. అదేంటి.. పిల్లలను ఉత్పత్తి చేయడమేంటని ఆశ్చర్యపోకండి. ఫ్యూచర్‌‌లో కోడి పిల్లల్ని ఉత్పత్తి చేసినంత ఈజీగా బిడ్డల ఉత్పత్తి జరగబోతోంది. అదికూడా ఎంతో దూరంలో లేదు. ఇదంతా ఏఐ టెక్నాలజీతోనే సాధ్యమవుతోంది. ఇంతకూ, ఏంటీ ఏఐ టెక్నాలజీ? ఈ టెక్నాలజీతో పిల్లల ఉత్పిత్తి ఎలా సాధ్యపడుతుంది? ఈ టెక్నాలజీతో జన్మించిన పిల్లలు మనలా మామూలుగానే ఉంటారా?

ప్రతి మహిళకు పురిటి నొప్పులు పునర్జన్మతో సమానం. ఓ బిడ్డకు జన్మనివ్వడానికి మహిళ ఎంతో వేదన పడుతుంది. ఎన్ని నొప్పులైనా సులభంగా భరిస్తుంది. పురిటినొప్పులతో బాధపడినా తను ఓ బిడ్డకు జన్మనిచ్చామని సంతోషపడుతుంది.. తన భర్త వంశం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. పండంటి బిడ్డ పుట్టాక అన్ని బాధలను మరిచిపోతుంది. బిడ్డను కనే సందర్భంలో స్త్రీలకు ఎదురయ్యే పరిస్థితిని మాటల్లో వర్ణించలేం. తొమ్మిది నెలల పాటు కడుపులో పెరిగే బిడ్డ కోసం ఎంతో సంబరపడుతుంది. కానీ, ఇప్పటికీ చాలామంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. కారణం ఏదైనా తానిక తల్లిగా మారే ఛాన్స్ లేదని తెలిసిన తర్వాత ఎందరో అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక పిల్లలు పుట్టరని తెలిస్తే వాళ్ల హృదయాలు బద్దలైపోతాయి. అయితే, ఇప్పుడా భయం అవసరం లేదు. ఎందుకంటే పునర్జన్మతో సమానమైన పురిటినొప్పులు లేకుండానే అమ్మగా మారే అవకాశం అందరికీ అందుబాటులోకి వచ్చేస్తోంది. కృత్రిమ బిడ్డను యంత్రాల్లో సృష్టించేందుకు ఏర్పాట్లు చకచకా జరిగి పోతున్నాయి.

సాధారణంగా గర్భిణులు అలసట, వికారం, నొప్పితో నానా అవస్థలు పడుతుంటారు. ఇవన్నీ భరించి ప్రసవానికి వెళ్తే.. కొన్నిసార్లు తల్లీబిడ్డలు ఇద్దరికీ ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తొచ్చు. గర్భిణికి ధూమపానం, ఒత్తిడి, వ్యాధులతోపాటు, కడుపులో మొజార్ట్ ఆడకపోయినా బిడ్డకు రిస్కే. దీనివల్ల బిడ్డ పూర్తి ఆరోగ్యంగా పుట్టకపోవచ్చు. ప్రీ మెచ్యూర్, సీసెక్షన్‌‌తో భవిష్యత్తులో అధ్వాన్నస్థితులు ఎదురు కావచ్చు. అందుకే ఇలాంటి ఇబ్బందుల్లేకుండా పండంటి బిడ్డను కనిచ్చే సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చాడు బెర్లిన్‌కు చెందిన నిర్మాత, సైన్స్ కమ్యూనికేటర్ హషేమ్ అల్-ఘైలీ. 'ఎక్టోలైఫ్' ఆర్టిఫిషియల్ వూంబ్‌తో ఎలాంటి నొప్పినీ భరించకుండానే బిడ్డను కనే అవకాశాన్ని ఇస్తున్నాడు.

నిజానికి.. ఎక్టోలైఫ్ ఆర్టిఫిషియల్ వూంబ్ చక్కని పరిష్కారాన్ని అందిస్తోంది. గర్భం మోయకుండానే బయోలాజికల్ పేరెంట్స్‌గా మారే ఛాన్స్ ఇస్తోంది. పూర్తిగా అమానవీయ వాతావరణంలో పిండం పెరుగుతుండగా.. శిశువుకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్, తల్లి కడుపులో ఉన్న వెచ్చదనాన్ని అందించేందుకు తగిన టెక్నాలజీతో ల్యాబ్ ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం, కార్బన్ ఫుట్‌ ప్రింట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్టోలైఫ్.. సూర్యరశ్మి, గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే హైలీ ఎఫిషియెంట్, క్లీన్, రీన్యూయబుల్ ఎనర్జీని ఉపయోగిస్తోంది. అయితే, ఈ సాంకేతికత ఇప్పుడు కాస్త వివాదాస్పదమైనప్పటికీ.. రాబోయే రోజుల్లో జనాదరణ పొందుతుందని నమ్ముతున్నారు దీని సృష్టికర్త. వచ్చే దశాబ్దాల్లో ఇది సర్వ సాధారణమైపోతుందని, జనాభా తగ్గుదల ఉన్న దేశాలకు మరో వరంగా మారుతుందటున్నారు.

మరోవైపు.. ఎక్టోలైఫ్ కోసం 75 హైలీ ఎక్విప్డ్ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.వాటిలోని ప్రతీ ల్యాబ్‌లో 400 గ్రోత్‌పాడ్స్ ఉంటాయి. అంటే ఈ ల్యాబ్స్ నుంచి ఏటా 30 వేల మందికిపైగా శిశువుల జననం జరుగుతుంది. ఉష్ణోగ్రత-నియంత్రిత, ఇన్ఫెక్షన్-రహిత గర్భధారణ పరిస్థితులను కల్పిస్తున్న ఆర్టిఫిషియల్ వూంబ్‌కు కనెక్ట్ చేసిన సెన్సార్స్ ద్వారా తల్లిదండ్రులు బిడ్డ హార్ట్ బీట్, టెంపరేచర్, బీపీ, శ్వాసరేటు, ఆక్సిజన్ సాచురేషన్‌ను తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్ బిడ్డ శారీరక స్థితులను కూడా మానిటర్ చేస్తుంది. జెనెటిక్ అబ్‌ నార్మాలిటీస్ ఉంటే రిపోర్ట్ చేస్తుంది. ఇక ఈ పాడ్స్‌పై ఉండే స్క్రీన్స్ బేబీ ప్రొగ్రెసివ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రియల్ టైమ్ డేటాను డైరెక్ట్‌గా పేరెంట్స్ ఫోన్‌కు అందిస్తుంది. ఫలితంగా.. ఇంట్లో నుంచే బేబీ ఎలా ఉందో పర్యవేక్షించవచ్చు. అంతేకాదు ఈ యాప్ శిశువు అభివృద్ధి గురించి హై రెజల్యూషన్‌తో కూడిన లైవ్ వ్యూను స్ట్రీమ్ చేస్తుంది. దీన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా షేర్ చేయొచ్చు.

ఇవి మాత్రమే కాదు.. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే భాష, సంగీతాన్ని గుర్తించగలదు కాబట్టి ఎక్టోలైఫ్ ఇంటర్నల్ స్పీకర్స్ సౌకర్యాన్ని సమకూర్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీతాన్ని బిడ్డలకు వినిపిస్తుంది. ఈ యాప్ ద్వారా బేబీ ఏం వినాలకుంటుందో తెలుసుకోవచ్చు. డైరెక్ట్‌గా శిశువు కోసం పాట కూడా పాడొచ్చు. ఒక్కమాటలో శిశువు జన్మించకముందే మన వాయిస్‌ను గుర్తించేలా చేయొచ్చు. దీంతో పాటూ బేబీ పాడ్ చుట్టూ ఏర్పాటు చేసిన 360 డిగ్రీల కెమెరా, వర్చువల్ హెడ్ సెట్ ద్వారా వారు ఎలా ఉన్నారో, ఏం వింటున్నారో మనం కూడా వినొచ్చు. దీనికి కనెక్ట్ చేసిన వైర్‌లెస్ హాప్టిక్ సూట్ ద్వారా కడుపులో బిడ్డ తంతున్న అనుభూతిని పొందవచ్చు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోవచ్చు.

ఇదే సమయంలో ఎక్టోలైఫ్ ద్వారా బేబీ సరైన ఎదుగుదల కోసం మంచి పోషకాలను అందుకుంటుందని సంస్థ చెబుతోంది. పాడ్స్‌కు కనెక్ట్ చేసిన రెండు సెంట్రల్ బయోరియాక్టర్స్ ఈ పని చేస్తుంటాయి. మొదటి బయోరియాక్టర్‌లోని ఆక్సిజన్, పోషకాలు.. బిడ్డ కృత్రిమ బొడ్డు తాడు ద్వారా సప్లయ్ చేస్తారు. ఇందులో ఉండే లిక్విడ్ సొల్యూషన్.. తల్లి గర్భాశయంలో శిశువును చుట్టి ఉండే అమ్నియాటిక్ లిక్విడ్స్ మాదిరిగా వర్క్ చేస్తాయి. ఈ ద్రవం హార్మోన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, యాంటిబాడీస్‌ సమ్మేళనంగా ఉంటుంది. ఇక సెకండ్ బయో రియాక్టర్ బేబీస్ ప్రొడ్యూస్ చేసే వేస్ట్ ప్రొడక్ట్స్‌ను ఎలిమినేట్ చేస్తుంది. అయితే ఇంజనీర్డ్ ఎంజైమ్స్ సహాయంతో ఈ వ్యర్థాలను న్యూట్రిషన్స్‌గా మారుస్తుంది.

మరోవైపు.. గర్భస్రావంలో స్పెర్మ్ కౌంట్ సమస్యలకు కూడా ఎక్టోలైఫ్ పరిష్కారం చూపుతుందట. విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా జెనెటికల్‌గా సుపీరియర్ ఎంబ్రియోను సెలెక్ట్ చేస్తుండటంతో.. శిశువు జన్యుపరమైన సమస్యలు లేకుండా పుట్టేందుకు కారణమవుతుంది. అంతేకాదు ఈ గుడ్డును గర్భంలోకి ప్రవేశపెట్టే ముందు జీన్ ఎడిటింగ్ టూల్ ద్వారా శిశువు కనుగుడ్డు రంగు, హెయిర్ కలర్, స్కిన్‌ టోన్, శారీరక సామర్థ్యం, ఎత్తు, తెలివి వంటి వాటిని తెలుసుకోవచ్చు. కానీ ఇది ప్రత్యేక ప్యాకేజీగా ఎక్టోలైఫ్ చెబుతోంది. అలాగే, వంశపారంపర్య వ్యాధులు బిడ్డకు సంక్రమించకుండా చర్యలు తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇక తల్లిదండ్రులకు మరింత వెసులుబాటును అందించేందుకు ఇంట్లోనే బిడ్డను పుట్టించే అవకాశాన్ని అందిస్తోంది ఎక్టోలైఫ్. లాంగ్ లాస్టింగ్ మినియాటరైజ్డ్ బయోరియాక్టర్స్ ఉపయోగించి ఎవరింట్లో వారు ఎక్టోలైఫ్ గ్రోత్‌ పాడ్‌ను ప్లేస్ చేసుకోవచ్చట.

ఇవన్నీ ఒకెత్తయితే.. మారో షాకింగ్ విషయం ఒకటుంది. అదే డీఎన్‌ఏ డీటెయిల్స్. ఆర్టిఫిషియల్‌ వూంబ్‌ నుంచి అమ్నియాటిక్ ఫ్లూయిడ్‌ను డిశ్చార్జ్ చేసిన తర్వాత.. బేబీని ఈజీగా పోడ్‌ నుంచి బయటకు తీయడం వరకూ అంతా సరే. కానీ, ఈ మొత్తం ప్రాసెస్‌లో బిడ్డ తమదేనా కాదా అనే అనుమానం లేకుండా ఉండేందుకు.. డెలివరీకి ముందే బేబీ డీఎన్‌ఏను తల్లిదండ్రులకు అందించే వెసులుబాటు కూడా ఉందట. మొత్తంగా.. ఎక్టోలైఫ్ ఎంట్రీతో అమ్మతనానికి ఢోకా లేదు. జనాభా తగ్గుదల దేశాలకైతే ఇదో వరంగా మారడం ఖాయం. ఇదే సమయంలో ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ తప్పుదారిలో వెళితే మాత్రం విపరీతాలే వినాశకాలు అన్నట్టుగా పరిస్థితులు ఎలా ఐనా మారిపోవచ్చు. 

Full View


Tags:    

Similar News