వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. మాస్క్ లేకుండానే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ -19 చికిత్స పొందుతున్న మిలటరీ ఆసుపత్రి నుంచి వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చారు. అయితే ఆయన ప్రొటెక్టీవ్ మాస్కు లేకుండా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ -19 చికిత్స పొందుతున్న మిలటరీ ఆసుపత్రి నుంచి వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చారు. అయితే ఆయన ప్రొటెక్టీవ్ మాస్కు లేకుండా వైట్ హౌస్లోకి ప్రవేశించడంతో చూసేవారికి ఆశ్చర్యం కలిగింది. తెల్లటి శస్త్రచికిత్సా మాస్కు ధరించిన డొనాల్డ్ ట్రంప్.. వాషింగ్టన్ లోని వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ గుండా ఎగ్జిక్యూటివ్ భవనం వద్దకు వెళ్లారు.. ఈ సందర్బంగా విలేకరులు ఆయనకు తారసపడ్డారు.. వైట్ హౌస్ సౌత్ కు నడిచి వెళుతుండగా తన మాస్కును తీసివేసి, విలేకరులకు పోజులిచ్చారు, అంతేకాదు కొందరు విలేకరులకు అభివాదం కూడా చేశారు.
అయితే ట్రంప్ చర్య సబబుకాదని కొంతమంది మిలటరీ ఆస్పత్రి వైద్యులు, డెమొక్రాట్లు విమర్శలు చేశారు. కొద్దిరోజులుగా తన ఆరోగ్యం బాగుపడాలని ప్రార్ధనలు చేస్తున్న అభిమానులకు ఉత్తేజం కలిగించేందుకే ఇలా చేసినట్లు ట్రంప్ అన్నారు. కాగా నవంబర్ 3న యుఎస్ ఎన్నికల్లో డెమొక్రాట్ జో బిడెన్‌పై తిరిగి ఎన్నికలకు పోటీ చేస్తున్న రిపబ్లికన్ అధ్యక్షుడు, కరోనావైరస్ వ్యాధి బారినపడ్డారు. గురువారం ట్రంప్, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. దీంతో శుక్రవారం ఆసుపత్రిలో చేరారు.