న్యూయార్క్ జడ్జిగా సరితా కోమటిరెడ్డి!
అగ్రరాజ్యంలో మరో ఇండో- అమెరికన్ మహిళకు అరుదైన అవకాశం లభించింది. భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డిని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా నామినేట్ చేసింది ప్రభుత్వం.
అగ్రరాజ్యంలో మరో ఇండో- అమెరికన్ మహిళకు అరుదైన అవకాశం లభించింది. భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డిని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా నామినేట్ చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దీంతో అమెరికాలో అరుదైన గౌరవం అందుకున్న ప్రముఖ వ్యక్తుల జాబితాలో సరిత చేరిపోయారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా అందుకున్న సరితా కోమటిరెడ్డి.. కెలాగ్ హన్సెన్ టాడ్ ఫిజెట్ అండ్ ఫ్రెడెరిక్ సంస్థలో ప్రైవేటుగా ప్రాక్టీసు పూర్తి చేసుకున్నారు. అనంతరం అమెరికా న్యాయవ్యవస్థలోని వివిధ విభాగాల్లో పనిచేశారు..
ప్రస్తుతం.. యూఎస్ అటార్నీ ఆఫీస్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జనరల్ క్రైమ్స్ డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. అయితే తాజాగా ఆమెకు ప్రమోషన్ వచ్చింది. గతంలో కూడా యూఎస్ అటార్నీ ఆఫీస్ కార్యాలయంలో... అంతర్జాతీయ నార్కోటిక్స్, మనీ లాండరింగ్.. కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సమన్వయకర్తగా పనిచేశారు. అంతేకాదు బీపీ డీప్‌వాటర్ హారిజన్ ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ జాతీయ కమిషన్ తరఫున లాయర్‌గా కూడా సరితా కోమటిరెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.
ఇదిలావుంటే సరిత డాక్టర్ తల్లిదండ్రులు ఇద్దరూ తెలంగాణకు చెందినవారు.. వారు కొన్ని సంవత్సరాల కిందట యుఎస్ లో స్థిరపడ్డారు. తండ్రి హనుమంత్ రెడ్డి మిస్సౌరీలో కార్డియాలజిస్ట్ ఇక ఆమె తల్లి గీతా రెడ్డి రుమటాలజిస్ట్. మరోవైపు జడ్జి పదవికి సరితను నియమించడం పట్ల అమెరికాలోని భారతీయ-అమెరికన్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తెలుగు సంఘం ఆమెను అభినందించింది. "మెరిట్ సరిగా గుర్తించబడింది," అని న్యాయవాది డోనేపుడి నాగేశ్వరరావు అన్నారు.
కాగా తన భారత పర్యటనకు ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత తూర్పు న్యాయవాది సరిత కొమటిరెడ్డిని న్యూయార్క్ తూర్పు జిల్లాకు న్యాయమూర్తిగా ఎంపిక చేయడం సంతోషకరమైన వార్త. ఆమె ఎంపిక పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.