ట్రంప్ తెచ్చిన కొత్త వీసారూల్స్ ప్రభావం వందల మంది భారతీయులపై పడే అవకాశముందన్న హెచ్చరికలు ఇప్పటికే వినిపిస్తున్నాయ్. ఐతే ఈ డెసిషన్ వల్ల ఐటీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందని అమెరికా సంస్థలు అంచనా వేస్తున్నాయ్. దాదాపు 7లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉందని అంటున్నాయ్. డిసెంబర్ 31వరకు కొత్తగా హెచ్1బీ, ఎల్ 1 వీసాల ఆంక్షలపై తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై జూన్ 22న ట్రంప్ సంతకం చేశారు. ఐతే ఈ నిర్ణయం ఫార్చున్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఈ నష్టం విలువ భారీగా ఉంటుందని అమెరికాకు చెందిన బ్రోకింగ్స్ ఇనిస్టిట్యూట్ అనే సంస్థ అంచనా వేసింది.
వీసాల నిలిపివేత వల్ల దాదాపు 2లక్షల మంది విదేశీ నిపుణులు అమెరికా రాకుండా పోతారని ఈ నివేదికలో తెలిపారు. ట్రంప్ నిర్ణయం అమెరికా సంస్థలపై ప్రభావం చూపడమే కాకుండా కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం చేపడుతోన్న చర్యలు తాజా నిర్ణయంతో స్లో అవుతాయని తెలిపారు.