Afghanistan: ఆప్ఘన్‌లో రాక్షస పాలన

Afghanistan:ఆప్ఘన్ పౌరులపై క్రూరమైన శిక్షలు విధింపు

Update: 2021-09-25 02:51 GMT

ఆఫ్గనిస్తాన్ పౌరులపై తాలిబన్ల అరాచకం (ఫైల్ ఇమేజ్)

Afghanistan: ఆప్ఘన్‌ మళ్లీ రాక్షస పాలన వైపు అడుగులు వేస్తోంది. తాము మారామని చెబుతున్న తాలిబన్లు, క్రూరమైన శిక్షలు విధిస్తున్నారు. తాలిబన్ల ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ఆరుగురి చర్మం వలిచి దారుణంగం చంపేశారు. షరియత్‌ ప్రకారం శిక్షలు అమలు చేస్తామంటూ తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. చట్టాల గురించి ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు.

చేతులు నరకడంలాంటి క్రూరమైన శిక్షలను అమలు చేస్తామని ప్రకటించారు‌. దీనిపై విధివిధానాలను రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. గతంలో మాదిరిగా బహిరంగంగా శిక్షలను అమలు చేయాలా..? వద్దా..? అనే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్న తాలిబన్లు.. ఎవరి చట్టాలు వారివే అన్నారు. తమ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదంటూ హెచ్చరించారు.

కాగా.. ఉదయాన్నే లేవడం, ఇంటిపనులు చేసుకుని కునుకు తీయడం.. మళ్లీ తినడం.. రాత్రి పడుకోవడం ఈ వ్యవహారం తనకు నచ్చడంలేదని, మహిళా విద్యతోనే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుందంటూ ఓ బాలిక వీడియో మెసేజ్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యింది. తమ హక్కులను కాలరాజేందుకు ఈ తాలిబన్లు ఎవరు అని ప్రశ్నిస్తోంది.

Tags:    

Similar News