కరోనా వైరస్ ఒక్కటే.. కానీ, ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది.. ఎందుకు ఈ తేడా..?
కరోనా వైరస్ ఒక్కటే.. కానీ, ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. దేశ దేశానికి చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకు ఇలా కనిపిస్తోంది. దానికి దారి తీస్తున్న పరిస్థితులు ఎంటీ..? ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఇదే చర్చ నడుస్తుంది. ఈ కరోనా వైరస్ అంత వేగంగా విజృంభించడం లేదని సైంటిస్టులు అంచనా వేస్తున్నప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం మృత్యు ఘోషగా మారింది. మరికొన్ని దేశాల్లో బాధితులు ఎక్కువ మరణాలు తక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి ప్రపంచం అంతా ఒక్కటై నిలుస్తున్నా దాన్ని అరికట్టలేక పోతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మృత్యుఘోష వినిపిస్తోన్న కరోనా వైరస్. కరోనా వైరస్ ఒక్కటే.. కానీ, ఒక్కో దేశంలో ఒక్కోలా కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో బాధితులు తక్కువ.. మరణాలు ఎక్కువ..? ఎందుకు ఈ తేడా..?
ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటిగా మోగిస్తున్న కరోనా ఒక్కొక్క దేశంలో ఒక్కోలా కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో బాధితులు ఎక్కువ మరణాలు తక్కువ. మరికొన్ని దేశాల్లో మరణాలు ఎక్కువ బాధితులు తక్కువగా నమోదు అవుతున్నాయి. అయితే ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా బాధితులు 30లక్షలకు చేరింది. మృతుల సంక్య 2లక్షలకు పైగా ఉంది. అయితే నమోదైన కేసులు, మరణాలను లెక్కిస్తే 6.96 శాతం చనిపోయారు అయితే ఈ లెక్క ఒక్కొక దేశంలో ఒక్కోలా ఉంది.
కరోనా వైరస్ మరణాల రేటు ఒక్కో దేశంలో ఒక్కోలా నమోదు అవుతోంది. కరోనా కట్టడి చేస్తున్న దక్షిణ కొరియాలో 2.24 శాతం ఉంటే ఫ్రాన్స్ లో ఏకంగా 14శాతంగా ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అయిన అమెరికాలో 5.56 శాతం, భారత్ లో 3.12 శాతంగా ఉంది. ఈ శాతాల్లో తేడాను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు, వైద్య బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఈ భారీ తేడాలకు కారణం ఆయా దేశాల్లో అనేక అంశాలు కారణం అవుతుందని ఒక అంచనాకు వచ్చారు.
జన సాంద్రత, వయోభేదాలు, వైద్య సదుపాయాల లేకపోవడం, పెరిగిన కేసుల తీవ్రతకు అనుగుణంగా చికిత్సలు అందించే వైద్యం అందుబాటులో లేకపోవడం లాంటివి మరణాల రేటులో తేడాలకు కారణాలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరోనా ను తగ్గించేందుకు సరైన సమయంలో చర్యలు చేపట్టడం, వ్యాధిని ముందే గుర్తించడం, పరీక్షల సామర్థ్యం, ప్రజారోగ్య విధానాలూ కీలకమేనని చెప్తున్నారు. మరోవైపు అనేక దేశాల్లో పరీక్షల నిర్వహణ తీరు, కేసుల లెక్కింపు విధానాల్లో తేడాలుండటం కూడా మరణాల రేటు మారడానికి ఒక కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొన్ని దేశాల్లో కొవిడ్ లక్షణాలు బయటపడిన వారికి, ఆస్పత్రులకు వస్తున్న వారికే పరీక్షలు చేస్తున్నారు. స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు బయట పడకపోయినా పరీక్షలు చేయడం లేదు. అనుమానితులు, కొవిడ్ రోగులతో సన్నిహితంగా ఉన్నవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్ ను పరీక్షలు చేస్తే మొత్తం రోగుల సంఖ్య తేలుతుందని అప్పుడు మరణాల రేటును కూడా ఖచ్చితంగా అంచనా వేయవచ్చని నిపుణులు చెప్తున్నారు. జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పరీక్షలు ఎక్కువ చేయడం వల్లే మరణాల రేటు తక్కువగా ఉంటోందని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు అమెరికాలో ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి మధ్య మరనాల రేటులో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి ఇటు భారత్‌లో మరణాల రేటు 3.12 శాతంగా ఉంది. కోలుకుంటున్న వారి శాతం 20.89 శాతంగా ఉంది. ఇండియాలో అత్యధికంగా మహారాష్ట్రలో మరణాల రేటు 4.42శాతంగా ఉంది. కరోనా లక్షణాలు కనిపిస్తే తొలి దశలోనే చికిత్సలు అందించడం, తీవ్రంగా దీని బారిన పడిన వారికి ప్రత్యేక చికిత్సలు అందించడం, ఇతర జాగ్రత్తలు పాటిస్తే మరణాల శాతం తగ్గుతుంది అని నిపుణులు చెప్తున్నారు.