China: చైనాలో విలయతాండవం చేస్తున్న కరోనా

China: రోజు రోజుకు పెరుగుతున్న మరణాల సంఖ్య

Update: 2022-12-19 02:27 GMT

China: చైనాలో విలయతాండవం చేస్తున్న కరోనా

China: చైనాలో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చైనా సర్కారు మాత్రం మరణాలు దాచిపెడుతోందంటూ ప్రపంచ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. నిన్న ఉదయం బీజింగ్‌లోని డోంగ్జావో శ్మశానవాటికలో 150 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు జరగాయి. వాటిల్లో 30 మరణాలు కొవిడ్‌ పాజిటివ్‌ వల్ల జరిగినవే అని శ్మశాన వాటిక సిబ్బంది, మృతుల బంధుమిత్రులు తెలిపారు. బీజింగ్‌లోని ఇతర శ్మశాన వాటికల్లో కూడా ఇప్పుడు మృతదేహాల రద్దీ నెలకొందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. కాగా, చైనాలో కొవిడ్‌ మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరిగే ప్రమాదముందని అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ సంస్థ అంచనా వేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి చైనాలో గరిష్ఠ స్థాయికి కొవిడ్‌ కేసులు పెరుగుతాయని ఆ సమయానికి 3.22 లక్షలకు మరణాలు చేరుకుంటాయని తెలిపింది. వచ్చే ఏడాది చివరికల్లా మరణాల సంఖ్య 10 లక్షలకు పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.

Tags:    

Similar News