Mrs Sri Lanka: విజేత పుష్పిక తలపై కిరీటం లాగిన మిసెస్ వరల్డ్
Mrs Sri Lanka: "మిసెస్ శ్రీలంక" పోటీల్లో రసాభాస చోటుచేసుకుంది.
Mrs Sri Lanka: "మిసెస్ శ్రీలంక" పోటీల్లో రసాభాస చోటుచేసుకుంది. అంతకుముందు మిసెస్ వరల్డ్ వచ్చి విజేతైన పుష్పిక తలపై కిరీటం అలంకరించింది. ప్రస్తుతం మిసెస్ వరల్డ్‌గా ఉన్న కరోలిన్ మాత్రం పోటీల నిబంధనల ప్రకారం విడాకులు తీసుకున్న మహిళకు కిరీటాన్ని స్వీకరించే అర్హత లేదన్నారు. అంతేకాదు ఈ కిరీటం మొదటి రన్నరప్‌కు దక్కుతుందంటూ పుష్పిక తలపై ఉన్న కిరీటాన్ని వేగంగా తీసి మొదటి రన్నరప్ తలపై ఉంచారు.
ఇక పుష్పిక తలపై కిరీటాన్ని బలవంతంగా తీసే క్రమంలో మిసెస్ శ్రీలంక జుట్టు కిరీటంలో చిక్కుకుపోయింది. అయితే అవేమీ పట్టించుకోని కరోలిన్ తనపని తాను చేసుకుపోయింది. ఆ పరిమాణంతో అక్కడున్నవారందరూ విస్తుపోయారు. ఇక తీవ్ర నిరాశకు గురైన పుష్పిక వేదిక వెనుకవైపు నుంచి వెళ్లిపోయారు. అంతేకాదు ఆగ్రహానికి గురైన పుష్పిక ఫేస్‌బుక్‌లో తాను విడాకులు తీసుకోలేదని తీసుకొని ఉంటే ఆ ప్రతాలు చూపించాలని సవాలు విసిరారు.
మొత్తానికి అందాల పోటీల నిర్వాహకులు కూడా ఈ ఘటనపై స్పందించారు. పుష్పిక విడాకులు తీసుకోలేదని చెప్పడంతోపాటు ఆమెకు మళ్లీ కిరీటాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడిన మిసెస్ శ్రీలంక దేశంలోని ఒంటరి తల్లులందరికీ తన విజయం అంకితమన్నారు.