Chinese Scientists: కరోనా వైరస్‌తో ఆయుధాలు..!
China Scientists: 2015లోనే చైనా సైంటిస్టుల చర్చ 'ది ఆస్ట్రేలియన్' కథనం వెల్లడి
Chinese Scientists: కరోనా వైరస్‌తో ఆయుధాలను తయారు చేయడంపై 2015లోనే చైనా శాస్త్రవేత్తలు చర్చించారా..? సార్స్ కరోనా వైరస్‌లు నూతన శకం జీవాయుధాలా..? ఇప్పటికే మనుషుల్లో వ్యాధికారక వైరస్‌లోకి దీనిని కృత్రిమంగా చొప్పించి ఆయుధాలుగా మలచుకోవచ్చా? అవుననే అంటోంది 'ది ఆస్ట్రేలియన్' కథనం. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అది జీవాయుధాలతోనే అని చైనా సైంటిస్టులు, ఆరోగ్య అధికారులు ఒక లెటర్‌లో రాసినట్లు పేర్కొంది.
సార్స్ కరోనా వైరస్‌లను నూతన శకం జన్యు ఆయుధాలుగా డ్రాగన్ అభివర్ణిస్తోనట్లు 'ది ఆస్ట్రేలియన్' కథనం తెలియజేసింది. జీవాయుధంతో దాడి చేస్తే శత్రుదేశం వైద్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని చైనా సైన్యం పేర్కొంటోంది. కరోనా మహమ్మారి 2019లో విరుచుకుపడిప్పటికీ చైనా సైన్యానికి శాస్త్రవేత్తలు ఇలాంటి వైరస్‌తో ఆయుధాల తయారీ గురించి ఐదేళ్ల క్రితం నుంచే చర్చిస్తూ వచ్చినట్లు తెలిపింది.
కోవిడ్-19పై స్వీయ దర్యాప్తులో భాగంగా అమెరికా అధికారులకు ఈలెటర్స్ దొరికాయని సమాచారం. చైనా పీపుల్స్ లిజరేషన్ ఆర్మీ కమాండర్లు ఎలాంటి ఘాతుకాలకు పాల్పడతారో ఇవి రుజువు చేస్తున్నాయని యూకే నుంచి వెలువడే 'ద సన్' వెల్లడించింది. వుహాన్ వైరస్ వెనక రహస్యాలను వెల్లడించేలా త్వరలో ఒక పుస్తకాన్ని వెలువరించనున్నారు. చైనా పరిశోధకులు ఏం చేస్తున్నారో చెప్పడానికి ఇది నిదర్శనమంటున్నారు.
భిన్న రకాల వైరస్‌లను సైనిక అవసరాలకు ఎలా వాడుకోవచ్చనేది శాస్త్రవేత్తలు ఆలోచిస్తుండడం స్పష్టమని ఏఎస్‌పీఐ కార్యనిర్వాహకకు చెందిన ఓ వ్యక్తి చెబుతున్నారు. సైనిక అవసరాలకు ఉద్దేశించిన రోగకారక అణువు ప్రమాదవశాత్తూ బయటకు విడుదలైందన్న వాదనను బలపరిచేలా ఇది ఉందని చెప్పారు. మరోవైపు.. వుహాన్ మార్కెట్ నుంచి వైరస్ బయటకు వచ్చినట్లయితే దానిపై దర్యాప్తు నిమిత్తం ఇతర దేశాల నుంచి వస్తామన్నవారికి చైనా సహకరించి ఉండేది. కానీ.. వైరస్ మూలాల్లోకి వెళ్లాలన్న ప్రయత్నాన్ని డ్రాగన్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు.