ఢిల్లీలో చైనా గూఢచారి కలకలం.. మూడేళ్లుగా పురుష బౌద్ధ సన్యాసిగా మారువేషం
China Spy: డోల్మా లామా పేరుతో చెలామణి
China Spy: అది ఢిల్లీ ఉత్తరాన ఉన్న టిబెట్ శరణార్థి శిబిరంలో మంజు కా టిల్లాలో డోల్మా లామా అనే బౌద్ధ సన్యాసి ఉన్నాడు. మూడేళ్లుగా ఈ శిబిరంలో ఉంటున్నా డోల్మా లామాపై ఎవరికీ అనుమానం రాలేదు. తాజాగా ఢిల్లీ పోలీసులకు మాత్రం లామా తీరుపై సందేహం వచ్చింది. దీంతో లామాను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమెను ప్రశ్నించిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని విస్తుపోయారు. డోల్మా లామా పురుషుడు కాదు స్త్రీ అని తేలింది. మూడేళ్ల పాటు ఎవరికీ అనుమానం రాకుండా పురుష సన్యాసిగా మేనేజ్ చేయడం ఆసక్తి రేపింది. దీంతో ఆమే పుట్టు పుర్వోత్తరాలపై పోలీసులు ఆరా తీయడం మొదలు పెట్టారు. శరణార్థి శిబిరంలో తీగలాగితే చైనాలో డొంక కదిలింది. ఆమె డోల్మా లామా అనే పురుష బౌద్ధ సన్యాసిగా చెలామణి అవుతోంది. అయితే ఆమె గురించి మరింత తనిఖీలు నిర్వహించగా నేపాల్‌కు చెందిన ఖాట్మాండు చిరునామా లభించింది అది కూడా అనుమానంగానే ఉండడంతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
30 ఏళ్ల వయస్సున్న ఆమెను గురించి మరింత ఆరా తీయగా చైనాకు చెందిన కాయ్ రువోగా పోలీసులు నిర్ధారించారు. బౌద్ధ సన్యాసి వేషంలో టిబెట్ శరణార్థి శిబిరానికి వచ్చినట్టు తేల్చారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు నుంచి సేకరించి ఆధారాల ఆధారంగా అతడిని ఆమెగా ప్రకటించారు. చైనీస్ పాస్‌పోర్టుతో 2019లో భారత్‌లోకి కాయ్ రువో ప్రవేశించినట్టు ప్రకటించారు. ఆమెకు ఇంగ్లిష్‌తోపాటు మాండరిన్, నేపాలీ భాషల్లో అనర్గలంగా మాట్లాడగలదని పోలీసులు నిర్ధారించారు. అయితే ఆమె చైనా కోసం గూడఛార్యం చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చైనాకు ఎలాంటి సమాచారం చేరవేసిందో తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అయితే చైనా కమ్యూనిస్ట్ నేతలు కొందరు తనను చంపే యత్నం చేస్తున్నారని తప్పించుకునేందుకు ఇలా వేషం మార్చినట్టు ఆమె ప్రాథమికంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు ఆమెను మరింత లోతుగా విచారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
టిబెట్‌లోని చైనీయుల ఆరాచకాలను తట్టుకోలేక పలువురు టిబెటన్లు నేపాల్ మీదుగా భారత్‌కు తరలిస్తున్నారు. టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడాన్ని భారత్, అమెరికా వంటి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. టిబెటన్లకు స్వతంత్రం ఇవ్వాలంటూ నినదిస్తున్నాయి. ఈ క్రమంలో టిబెట్ నుంచి వచ్చే పౌరులకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోంది. అందుకు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో, ఢిల్లీలోని మంజు కా టిల్లాలోనూ ప్రత్యేక శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేసింది. వారికి స్కూళ్లు, ఇతర వసతులను కల్పిస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా టిబెటన్లతో పాటు బౌద్ధ గురువులు, సన్యాసులు ఉంటారు. ఈ క్రమంలోనే చైనీయుల రూపురేఖలు టిబెటన్లలాగే ఉంటాయి. ఈ క్రమంలో కాయ్ రువో బౌద్ధ సన్యాసి వేషంలో వచ్చినా ఎవరికీ అనుమానం రాలేదు. ఇక ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌కు సమీపంలో ఉందీ క్యాంప్. విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతంగా దీనికి పేరుంది. ఇక్కడ ఉండేవాళ్లను పోలీసులు నిరంతరం ఓ కంట కనిపెడుతూ ఉంటారు.