China Apps: యాప్‌లపై నిషేధం విధించడంపై చైనా తీవ్ర ఆందోళన

China Apps: సరిహద్దులోని జూన్ 15 గల్వాన్‌ వద్ద భీకర ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరు పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2020-07-01 04:14 GMT

China Apps: సరిహద్దులోని జూన్ 15 గల్వాన్‌ వద్ద భీకర ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరు పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్రం చైనా దేశానికి చెందిన పలు యాప్‌లపై నిషేదం విధించింది. దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, జూమ్, హెలో యాప్ లపై నిషేదం విధించింది. అయితే భారత ప్రభుత్వం 59 యాప్‌లపై నిషేధం విధించడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

చట్టపరమైన పెట్టుబడి దారులహక్కులను కాపాడే బాధ్యత భారత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ మాట్లాడుతూ .. 'యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై చైనా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో తలెత్తిన పరిస్థితులను గమనిస్తున్నాం.అంతర్జాతీయ నిబంధనలు, స్థానిక చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహించుకోవాలని చైనా ప్రభుత్వం ఆ వ్యాపార సంస్థలను ఎల్లప్పుడూ కోరుతోంది.

చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించాల్సిన చైనా సహా బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. భారత్ - చైనాల దేశాల మధ్య ఆచరణాత్మక సహకారం వాస్తవానికి రెండు దేశాలకూ అటువంటి సహకారంలో మేలు చేసేదే. ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం భారత్‌కు ఏమాత్రం ప్రయోజనం కలిగించవు'అని ఆయన పేర్కొన్నారు. టిక్‌టాక్‌ యాప్‌ను బ్లాక్‌ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై ఆ సంస్థ స్పందించింది.

గూగుల్‌ ప్లే స్టోర్, యాపిల్‌ ప్లే స్టోర్‌ నుంచి తమ యాప్‌ను టిక్‌టాక్‌ సంస్థ తొలగించింది. కేంద్ర ఉత్తర్వులకు లోబడి నడుచుకుంటామని..భారత ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తామని, తమ యాప్‌ భారతీయ వినియోగదారుల సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి చేరవేయలేదని తెలిపింది. వినియోగదారుల వ్యక్తి గత సమాచార గోప్యతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ప్రభుత్వ సంస్థల ఆహ్వానం మేరకు సమాధానం, వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ చెప్పారు.


Tags:    

Similar News