Indo-China: మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించిన డ్రాగన్ కంట్రీ

సరిహద్దుల్లో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టిన చైనా సౌత్ సిక్కిం నకులా ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు

Update: 2021-07-15 14:45 GMT

ఇండో-చైనా (ఫైల్ ఫోటో)

Indo-China: మరోసారి డ్రాగన్ కంట్రీ చీప్ మెంటాలిటీ బయటపడింది. సరిహద్దు ఉద్రిక్తత సద్దుమణక్కుండానే పదేపదే వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. తాజాగా ఇండో-చైనా వాస్తవాధీన రేఖ సమీపంలో పెద్దఎత్తున శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. వివాదాస్పద ప్రాంతాలకు వేగంగా బలగాలను చేర్చేందుకు వీలుగా కాంక్రీట్ శిబిరాలను నిర్మిస్తోంది. సౌత్ సిక్కిం నకులా ప్రాంతంలో ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. నకులా సెక్టార్‌లో గతేడాది భారత్‌, చైనా బలగాలకు ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఈ నిర్మాణాలు కొద్ది మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఇక ఈస్ట్ లద్దాఖ్‌, అరుణాచల్‌ సెక్టార్‌ల వద్ద కూడా చైనా వైపు ఈ తరహా బిల్డింగ్స్ నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News