US Companies: భారత్‌కు సాయం చేసేందుకు 40 యూఎస్‌ కంపెనీల కన్సార్టియం

American Companies: కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అమెరికా నలుమూలల నుంచీ భారీ సాయం వస్తోంది.

Update: 2021-05-08 06:39 GMT

కరోనా (ఫైల్ ఇమేజ్ )

US Companies: కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అమెరికా నలుమూలల నుంచీ భారీ సాయం వస్తోంది. యూఎస్‌లోని 40కి పైగా ప్రముఖ కార్పొరేట్ సంస్థలన్నీ ఒక టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. దీనికోసం ఈ గ్లోబల్ టాస్క్‌ఫోర్స్ ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.

అమెరికాలోని కార్పొరేట్ సంస్థలు భారత్‌కు అందించే సహాయాన్ని ఈ స్టీరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. కమిటీలో ముగ్గురు భారతీయ అమెరికన్ సీఈఓలు సభ్యులుగా చేరారు. గుగూల్ సీఈఓ సుందర్ పిచాయ్, డెలాయిట్ సీఈఓ పునిత్ రెంజెన్, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ ఈ కమిటీలో చేరారు. ఇప్పటికే ఈ కమిటీలో బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్మన్ తదితర ప్రముఖులు ఉన్నారు.

Tags:    

Similar News