బట్టతల అంటే కేసే... ట్రైబ్యునల్ సంచలన తీర్పు..
Bald Head: బట్టతల.. ఎందరో పురుషులను వేధిస్తోంది.. తలపై జట్టులేకపోవడంతో పలువురు ఇబ్బంది పడుతున్నారు.
Bald Head: బట్టతల.. ఎందరో పురుషులను వేధిస్తోంది.. తలపై జట్టులేకపోవడంతో పలువురు ఇబ్బంది పడుతున్నారు. క్యాప్ లేదా విగ్‌ను పెట్టుకోకకుండా గడప దాటని వారు ఎందరో ఉన్నారు. బట్టతలపై ఎగతాళి చేయడంతో పురుషుల్లో ఆత్మనూన్యతా భావం భయాన్ని పెంచుతోంది. అయితే ఎవరైనా బట్టతలోడు అన్నారో ఖబడ్దార్ అంటోంది ఇంగ్లాండ్ కోర్టు పురుషులను బట్టతల అని పిలవడం లైంగిక వేధింపుల కిందికే వస్తుందని హెచ్చరించింది. పని చేసే చోట బట్టతల అని పిలవడంతో వారి గౌరవానికి భంగం కలుగుతున్నట్టు కోర్టు చెప్పింది. బాధితుడిని వేధింపులకు గురిచేసి అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించిన ఓ సంస్థపై ఇంగ్లాండ్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
బ్రిటన్‌లోని వెస్ట్ యోర్క్‌షైర్‌లోని బ్రిటిష్ బంగ్ తయారీ కంపెనీపై ఆ సంస్థ మాజీ ఉద్యోగి టోనీ ఫిన్ ఇంగ్లాండ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 24 ఏళ్ల పాటు బ్రిటిష్ బంగ్‌లో ఎలక్ట్రిషియన్‌గా ఫిన్ పని చేశాడు. అయితే సంస్థలోని సూపర్ వైజర్ తనను బట్టతల అంటూ నిత్యం వేధించేవాడని పిటిషన్‌లో ఆరోపించాడు. తనను వివక్షకు గురిచేసి అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినట్టు ఫిన్ ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశాడు. షేఫీల్డ్‌కు చెందిన ఎంప్లాయ్‌మెంట్ ట్రైబ్యునల్ న్యాయమూర్తి జోనాథన్ బ్రెయిన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులు విచారణ చేపట్టారు. తలపై జుట్టు తక్కువగా ఉందన్న కారణంగా కార్యాలయాల్లో పనిచేసే పురుషులను 'బట్టతల' పేరుతో పిలవడం అవమానించడమా? లైంగికంగా వేధించడమా? మూడు నెలలుగా వాదోపవాదనలు జరిగాయి.
బ్రిటిష్ బంగ్ కంపెనీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ బట్టతల స్త్రీ, పురుషుల్లో ఎవరికైనా ఉండవచ్చని ఇది సాధారణ విషయమని పేర్కొన్నారు. జన్యుసంబంధిత లోపంతో తలెత్తే సమస్యతో జుట్టు రాలి బట్టతల ఏర్పడుతుందని సమాజంలో బట్టతల అని పిలువడం సహజమని వివరించారు. అయితే స్త్రీలకు బట్టతల అనేది చాలా అరుదైన విషయమని కానీ పురుషులనే బట్టతల సమస్య అధికంగా వేధిస్తున్నట్టు ట్రైబ్యునల్ వ్యాఖ్యానించింది. పనిచేసే చోట ఏ పురుషుడినైనా బట్టతల అని పిలిస్తే కచ్చితంగా అది లైంగిక వేధింపుల కిందికే వస్తుందని ట్రైబ్యునల్ స్పస్టం చేసింది. బట్టతల అని పిలవడంతో వ్యక్తుల గౌరవం దెబ్బతింటుందని ఇది వారిలో ఆత్మనూన్యతా భావం కలగడమే కాదు వారిని భయాందోళనకు కూడా గురి చేస్తోందని అభిప్రాయపడింది.
బాధితుడిని వేధింపులకు గురి చేసి అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు సదురు కంపెనీ నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ట్రైబ్యునల్ స్ఫష్టం చేసింది. అయితే నష్టపరిహారం మొత్తం ఎంతనేది త్వరలోనే నిర్ణయిస్తామని న్యాయమూర్తి జోనాథన్ బ్రెయిన్ స్పస్టం చేశారు. ఆమేరకు కేసు విచారణను వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఇదివరకు 50 ఏళ్లు దాటిన తరువాత జట్టు ఊడి బట్టతల కనిపించేది. కానీ మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుషయం కారణంగా ప్రస్తుతం పాతికేళ్లలోపే యువకులకు బట్టతల వస్తోంది. అలాంటి వారు నలుగురితో కలవలేకపోతున్నారు. నవ్వుతూ మాట్లాడలేకపోతున్నారు. బట్టతలపై స్నేహితులు, తోటి ఉద్యోగులు ఎగతాళి చేయడం, జోకులు వేయడంతో ఇబ్బంది పడుతున్నారు. తాజా ఇంగ్లాండ్ ట్రైబ్యునల్ తీర్పుతో బ్రిటన్‌లో బట్టతల ఉన్నవారిలో హర్షం వ్యక్తమవుతోంది. తమ బాధలను ట్రైబ్యునల్ గుర్తించిందని, తమకు ఇక అలాంటి వేధింపులు ఉండవని భావిస్తున్నారు. ఇక నుంచి జుట్టులేకపోయినా తాము క్యాపులు, విగ్గులు ధరించాల్సిన అవసరం లేదని ఇంగ్లాడ్‌వాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.