Buddha statue vandalised in Pakistan: పాకిస్తాన్ లో బయటపడిన బుద్ధుడి పురాతన విగ్రహం.. విచ్ఛిన్నం చేసేశారు..

Buddha statue vandalised in Pakistan: పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లో తవ్వకాలలో బుద్ధుడి పురాతన విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం మూడు శతాబ్దాల నాటిదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Update: 2020-07-20 09:59 GMT

Buddha statue vandalised in Pakistan: పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లో తవ్వకాలలో బుద్ధుడి పురాతన విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం మూడు శతాబ్దాల నాటిదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మీడియా నివేదికల ప్రకారం, కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి ఇల్లు నిర్మించటానికి తఖ్త్-ఇ-బాహి ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ మరియు అతని ముగ్గురు కార్మికులు ఒక బుద్ధ విగ్రహాన్ని చూశారు. ఈ విషయం తెలుసుకున్న ఒక స్థానిక రాడికల్ నాయకుడు అక్కడికి చేరుకున్నాడు. విగ్రహాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆయన కార్మికులను కోరారు. దాంతో కొంతమంది దానిని సుత్తితో విరిచారని స్థానిక పోలీసులు చెప్పారు. ఈ సంఘటన సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటపడింది.

ఇందులో, ఒక వ్యక్తి విగ్రహాన్ని విచ్ఛిన్నం చేయమని కార్మికుడిని అడుగుతున్నాడు. విగ్రహంపై ఉన్న మట్టిని కూడా చేతితో తొలగిస్తున్నాడు. అయితే పురావస్తు శాఖకు సమాచారం ఇవ్వకుండా విగ్రహాన్ని విచ్ఛిన్నం చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు తవ్వకం జరిపిన ప్రాంతాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పురావస్తు అధికారుల అంచనా ప్రకారం ఈ విగ్రహం సుమారు 1700 సంవత్సరాలకు చెంది ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇది విచ్ఛిన్నం కావడానికి ముందే మంచి స్థితిలో ఉందని అధికారులు అన్నారు. కాగా గతంలో ఖైబర్‌ను శ్రీలంక, జపాన్ మరియు దక్షిణ కొరియా ప్రజలు సందర్శించారు. 

Tags:    

Similar News