బ్రిటన్ రాజుగా క్వీన్ ఎలిజబెత్ పెద్ద కుమారుడు చార్లెస్

*ఇక నుంచి కింగ్ చార్లెస్-3గా కొనసాగనున్న 73 ఏళ్ల చార్లెస్‌

Update: 2022-09-10 11:20 GMT

బ్రిటన్ రాజుగా క్వీన్ ఎలిజబెత్ పెద్ద కుమారుడు చార్లెస్

King Charles III: బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ మరణంతో ఆమె పెద్ద కుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ను నూతన రాజుగా అధికారికంగా ప్రకటించారు. చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. 73 ఏళ్ల వయసులో ఛార్లెస్‌ను రాజుగా ఖరారు చేయగా.. బ్రిటన్‌ రాజ చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. ఛార్లెస్‌ సతీమణి క్వీన్‌ కాన్సర్ట్‌ కెమిల్లా కుమారుడు ప్రిన్స్ విలియమ్‌ సహా అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో రాజుగా ఛార్లెస్‌ పేరును అధికారికంగా ప్రకటించారు. ఛార్లెస్‌ను రాజుగా ప్రకటించేందుకు సీనియర్‌ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశమయ్యారు.

ఈ భేటీలో మొదట బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ మరణాన్ని అధికారికంగా ప్రకటించిన అనంతరం శాసనకర్తలంతా కొత్త రాజుకు తమ విధేయత తెలిపారు. తర్వాత అధికారికంగా ప్రకటన చేశారు. ఛార్లెస్‌ను రాజుగా అధికారికంగా ప్రకటించిన పత్రంపై బ్రిటన్‌ ప్రధాని, కాంటర్‌బరీ ఆర్చిబిషప్‌, లార్డ్ ఛాన్స్‌లర్, పలువురు సీనియర్లు సంతకాలు చేశారు. ఇకపై ఛార్లెస్​ను కింగ్​ ఛార్లెస్​-3గా పిలుస్తారు. ఏడు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ కాలంపాటు బ్రిటన్‌ను పాలించిన ఎలిజబెత్‌-2... స్కాట్లాండ్​లోని తన వేసవి విడిది బల్మోరల్‌ క్యాజిల్‌లో గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

Tags:    

Similar News