గిన్నిస్ ఎక్కిన వెడ్డింగ్ డ్రస్..స్పెషాలిటీ పై మీరు ఓ లుక్కేయండి..

Bridal Dress: వివాహం..ప్రతి ఒక్కరి జీవితంలో మధుర ఘట్టం. ఈ వేడుక ద్వారా యువతీయువకులు తమ జీవితాల్లో సరికొత్త చాఫ్టర్ కు తెరతీస్తారు.

Update: 2023-05-14 15:00 GMT

 గిన్నిస్ ఎక్కిన వెడ్డింగ్ డ్రస్..స్పెషాలిటీ పై మీరు ఓ లుక్కేయండి..

Bridal Dress: వివాహం..ప్రతి ఒక్కరి జీవితంలో మధుర ఘట్టం. ఈ వేడుక ద్వారా యువతీయువకులు తమ జీవితాల్లో సరికొత్త చాఫ్టర్ కు తెరతీస్తారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ వివాహాన్ని నేటి యువత మధురాతి మధురంగా మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రీ, వెడ్డింగ్ షూట్స్, వెడ్డింగ్ షూట్స్ , డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు డిమాండ్ పెరిగింది. ఇక పెళ్లి వేడుకల్లో వధూవరులు ప్రత్యేక వస్త్రాలు, ఆభరణాలు ధరించి అందరి కన్నా ఆకర్షణంగా నిలుస్తారు. జీవితంలో చేసుకునే ముఖ్యమైన వేడుక అంటూ వాటి కోసం భారీ మొత్తంలో ఖర్చుపెడతారు. అలా ఓ ఫ్యాషన్ డిజైనర్ రూపొందించిన ఓ వెడ్డింగ్ గౌన్ ఏకంగా వరల్డ్ రికార్డ్ సాధిస్తూ గిన్నిస్ బుక్ ఎక్కింది.

వివాహాల్లో వధువులు ధరించే డ్రస్సులు ట్రెండ్ కు తగ్గట్టు ఎంతో ప్రత్యేకతతో ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటలీకి చెందిన బ్రైడర్ డిజైనర్ మిచెలా ఫెర్రిరో ఏకంగా 50వేలకు పైగా క్రిస్టల్స్ తో ప్రత్యేకంగా వెడ్డింగ్ గౌన్ ను డిజైన్ చేశారు. ఈ గౌన్ డిజైన్ చేసేందుకు 50,890 క్రిస్టల్స్ ను వినియోగించారు. నాలుగు నెలల పాటు ఎంతో శ్రమించి డిజైన్ చేసిన ఈ క్రిస్టల్ గౌన్ ను మిలాన్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ గౌన్ ను చూసి గిన్నిస్ సంస్థ కూడా ఫిదా అయింది. వెంటనే ఈ బ్రైడల్ గౌనును వరల్డ్ రికార్డ్ గా గుర్తిస్తూ..గిన్నిస్ లో చోటు కల్పించింది. గతంలో ఈ రికార్డ్ టర్కీకి చెందిన డిజైనర్ పేరిట ఉండేది. 45,024 క్రిస్టల్స్ తో వెడ్డింగ్ గౌన్ డిజైన్ చేస్తే ఆ రికార్డ్ ను 50 వేలకు పైగా క్రిస్టల్స్ తో మిచెలా ఫెర్రిరో అధిగమించింది.


Tags:    

Similar News