Bangladesh Floods: బంగ్లాదేశ్‌లో పోటెత్తిన‌ వరదలు.. 54 మంది మృతి..

Bangladesh Floods: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తుంటే ... మ‌రో వైపు ప్ర‌కృతి త‌న ప్ర‌కోపం చూపిస్తూ..విలాయ‌తాండ‌వం ఆడుతుంది. ఇప్పటికే మన దేశంలోని బీహార్‌, అసోం రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2020-07-22 13:49 GMT
floods in bagladesh

Bangladesh Floods: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తుంటే ... మ‌రో వైపు ప్ర‌కృతి త‌న ప్ర‌కోపం చూపిస్తూ..విలాయ‌తాండ‌వం ఆడుతుంది. ఇప్పటికే మన దేశంలోని బీహార్‌, అసోం రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక మన పొరుగుదేశ‌మైన బంగ్లాదేశ్‌లో కూడా వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వరదల దాటికి 54 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీవర్షాల వల్ల.. వచ్చిన వరదల్లో 2.4 మిలియన్ల మంది ఇబ్బందులు పడుతున్నారని.. 56వేల మందికి పైగా వరద ముంపుకు గురై నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. వీరిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించిన‌ట్టు ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ వెల్లడించారు. వరద విపత్తుతో అల్లాడుతున్న బంగ్లాదేశ్ కు మానవత్వంతో ఆహారం, మంచినీరు అందించాలని ఆయన పిలుపునిచ్చారు . అసలే కరోనాతో విలవిల్లాడుతున్న బంగ్లాదేశ్ లో తుపాన్ ముప్పు తీరని నష్టం కలిగించింద‌నీ, వరదబాధితులను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ద్వారా 5.2మిలియన్ల అమెరికా డాలర్ల అందజేసినట్లు డు జారిక్‌ తెలిపారు. 

Tags:    

Similar News