China Vaccine: చైనా టీకాల పనితీరు మరోసారి చర్చ
China Vaccine: చైనా టీకాతో రక్షణ తక్కువే..! * యాంటీబాడీల స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గుర్తింపు
China Vaccine: చైనా టీకాల పనితీరు మరోసారి చర్చనీయాంశమయ్యింది. చైనా సినోఫార్మ్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వృద్ధులకు రక్షణ కల్పించడం లేదని తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. టీకా తీసుకున్న పెద్దవారిలో వయసు పెరిగే కొద్దీ యాంటీబాడీల స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 179 దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇదే సమయంలో చైనా టీకాలు పంపిణీ చేస్తోన్న పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దీంతో చైనా వ్యాక్సిన్‌ల సమర్థతపై ఆయా దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా సినోఫార్మ్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఎక్కువ వయసున్న వారికి కరోనా నుంచి రక్షణ కల్పించడంలో తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నట్లు హంగేరీలో జరిపిన అధ్యయనంలో తేలింది. దీంతో చైనా టీకాల పనితీరు మరోసారి చర్చనీయాంశమయ్యింది.