Coronavirus: డ్రాగన్ కంట్రీని వణికిస్తున్న కోవిడ్ వైరస్

Coronavirus: స్థానికంగా వైరస్ వ్యాప్తి.. మొదలైన ఆంక్షలు

Update: 2021-10-22 02:06 GMT

Representational image

Coronavirus: డ్రాగన్ కంట్రీని మళ్లీ కరోనా వణికిస్తోంది. చైనాలో ఆగని వైరస్ తీవ్రత రోజురోజుకూ విస్తరిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పలు నగరాలు, పట్టణాల్లో స్థానికంగా కోవిడ్ వ్యాపిస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పాఠశాలలు మూసివేయడమే కాకుండా.. వందల సంఖ్యలో విమానాలను రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. ఇక వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారీ స్థాయిలో కొవిడ్‌ టెస్టులు, కాంటాక్టు ట్రేసింగ్‌ చేయడం ప్రారంభించింది.

ఇటీవల షాంఘై నుంచి షియాన్‌, గున్సూ, ఇన్నర్‌ మంగోలియా ప్రావిన్సుల్లో ఓ వృద్ధ జంట పర్యటించింది. వారిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో అధికారులు వారి కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి టెస్టులు చేయగా డజన్ల కొద్దీ కేసులు బయటపడుతున్నాయి. గురువారం ఒక్కరోజే 13 పాజిటివ్‌ కేసులు బయటపడినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. ఇలా స్థానికంగా ఒక్కసారిగా కొవిడ్‌ వ్యాప్తి మొదలు కావడంతో అప్రమత్తమైన అధికారులు భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.

కొవిడ్‌ తీవ్రత మొదలు కావడంతో చైనాలోని పర్యాటక ప్రాంతాలు, పాఠశాలలు మూసివేశారు. వేడుకలపై నిషేధం విధించారు. కేసులు బయటపడిన ప్రాంతాల్లో స్థానికంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దాదాపు 40లక్షల జనాభా కలిగిన లాన్‌జువో ప్రావిన్సుతో పాటు సమీప ప్రాంతాల ప్రజలను అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశించారు. కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు ఉన్నవారినే మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో బయటకు అనుమతిస్తున్నారు. ఇన్నర్‌ మంగోలియాలోని పలు ప్రాంతాల్లోనూ నగరం నుంచి రాకపోకలను నిషేధించారు. 

Tags:    

Similar News