afghan girl kills two taliban: శివంగిలా మారి ఇద్దరు తాలిబన్లను కాల్చిపారేసిన బాలిక

afghan girl kills two Taliban: ఆఫ్ఘనిస్థాన్ లో ఓ బాలిక ఉగ్రవాదుల పాలిట సివంగిలా మారింది. ఉగ్రవాదులు జరిపే కాల్పులకు భయపడకుండా ఎదురుతిరిగింది.

Update: 2020-07-22 08:47 GMT

పిల్లిని గదిలో బంధించి రోజూ కొడుతుంటే ఏదో ఒక రోజు అది పులిలా గర్జిస్తుందనే సామెత వినే ఉంటారు.. అలాగే చేసిందో బాలిక. ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదుల పాలిట సివంగిలా మారింది. ఉగ్రవాదులు జరిపే కాల్పులకు భయపడకుండా ఎదురుతిరిగింది. దాదాపు 40 మంది ఉగ్రవాదులను తుపాకి పట్టుకుని ఎదిరించింది. ఆమె కాల్పుల ధాటికి ఇద్దరు ముష్కరులు నేలమట్టమయ్యారు. ఈ ఘటన అఫ్గానిస్థాన్‌లోని సెంట్రల్‌ఘర్‌ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో జరిగింది.

ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు కమర్‌గుల్‌. వయసు 16 ఏళ్లు.. ఆమె తండ్రి గ్రామపెద్దగా ఉన్నారు. ఊరిలో అందరికి న్యాయం చెప్పేవారు. పైగా ప్రభుత్వ పెద్దలకు మద్దతుగా ఉన్నారు. అయితే అతని పెత్తనాన్ని సహించని ఉగ్రవాదులు ఆయనను ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ వేశారు. అయితే ఉగ్రవాదుల ప్లాన్ ఆతనికి తెలిసిపోయి.. వారికి చిక్కకుండా వుంటున్నారు. ఈ క్రమంలో కుమార్ గుల్ కుటుంబసభ్యులను హింసించడం ప్రారంభించారు ఉగ్రవాదులు. ఈ క్రమంలో ఈ నెల 17న అర్ధరాత్రి ఉగ్రవాదులు వారి ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపు తట్టారు. వచ్చింది ఎవరో చూడడానికి కమర్‌ తల్లి తలుపు తీసింది. ఉగ్రవాదులని అర్థం కాగానే లోపలికి రాకుండా అడ్డుకుంది. దీంతో వారు ఆమెను తుపాకీతో కాల్చారు.. దాంతో ఆమె మృతిచెందింది. తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. ఇంట్లో ఉన్న కమర్‌ తండ్రిని కూడా హతమార్చారు.

దీంతో తమ కసి తీరిందని అనుకుంటూ ఆ ఇంటినుంచి బయలుదేరారు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న కమర్ గుల్, ఇంట్లో ఉన్న ఎకె -47 తుపాకీని తీసుకున్నారు.. మొదట ఆమె తల్లిదండ్రులను చంపిన ఇద్దరు తాలిబాన్ లను కాల్చి చంపారు, తరువాత మరికొందరిపై కాల్పులు జరిపారు. దాంతో ఐదుగురు ఉగ్రవాదుల దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పక్కనే 12 ఏళ్ల తమ్ముడిని కాపాడుకుంటూనే, ఉగ్రవాదులతో అసమాన పోరాటం చేసింది. ఇంతలో గ్రామస్థులు, ప్రభుత్వ అనుకూల మిలిటెంట్లు ఆమెకు సహాయంగా వచ్చి ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించారు. దాంతో వారు పారిపోయారు. ఆమె సాహసాన్ని గుర్తించిన అధికారులు ఆమెను అభినందించారు. అయితే తాను ఈ పని ఎప్పుడో చెయ్యాల్సి ఉందని.. అలా చేసి ఉంటే తల్లిదండ్రులు తనకు దక్కేవారన్నారు. 

Tags:    

Similar News