97,000 Children Test Positive : స్కూల్స్ ఓపెన్ అయిన రెండు వారాల్లోనే 97 వేల మంది చిన్నారులకి కరోనా!
97,000 Children Test Positive : కరోనా వైరస్ .. కంటికి కనిపించని ఈ వైరస్ ఓ ఆరు నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తుంది.. న్యూజిలాండ్ తో పాటుగా
97,000 Children Test Positive : కరోనా వైరస్ .. కంటికి కనిపించని ఈ వైరస్ ఓ ఆరు నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తుంది.. న్యూజిలాండ్ తో పాటుగా పలు దేశాలు ఈ కరోనా నుంచి కోలుకోగా, మరికొన్ని దేశాలు ఇంకా కరోనాతో పోరాడుతున్నాయి.. ఇక కరోనా వలన అన్ని రంగాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి.. అందులో విద్యారంగం ఒకటి.. దీంతో ఈ విద్యా సంవత్సరం స్కూళ్లను తెరిపించేందుకు కొంచెం ఆలస్యం జరిగింది.. ప్రస్తుతం స్కూల్స్ ని తెరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి..
అయితే అలా స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయో లేదో అప్పుడే చిన్నారులు కరోనా బారిన పడుతున్నారు. అవును.. కరోనా వైరస్ బాగా ఉన్న దేశాలలో ఒకటైనా అమెరికాలో గడచిన రెండు వారాల్లో 97 వేల మంది చిన్నారులకి కరోనా సోకింది.. ఈ విషయాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలిపింది. జూలై 16 నుంచి జూలై 30 మధ్యలో దాదాపుగా లక్ష మంది పిల్లలకు వ్యాధి సోకిందని, దీంతో స్కూళ్లను తిరిగి తెరిపించడంపై అధికారులు పునరాలోచనలో పడ్డారని సమాచారం..
ఇక ఆ దేశంలో ఇంతవరకూ సుమారు 50 లక్షల మంది కరోనా బారిన పడ్డారని ప్రచారం చేసిన సీబీఎస్ న్యూస్ వీరిలో సుమారు 3.38 లక్షల మంది పిల్లలేనని తెలిపింది. దీనితో భవిష్యత్తులో పిల్లలకు టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని వాండర్ బిల్ట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ టినా హార్టర్ట్ అన్నారు. అయితే స్కూల్స్ కి పంపించే ముందు పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అయన అన్నారు..
ఇక కరోనా వలన అమెరికాలో ఇప్పటివరకూ దాదాపుగా 25 వేల మందికి పైగా పిల్లలు చనిపోయారు. దీంతో ఆన్ లైన్ క్లాసులను మాత్రమే ఈ ఏడాది జరిపించాలన్న డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వస్తోంది. వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో వ్యాక్సిన్ వచ్చేంత వరకూ స్కూళ్లు వద్దని కోరుతున్నారు.