మలేషియా కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న 80 మంది యువకులు

* 10 రోజులుగా ఎయిర్‌పోర్ట్‌లో తలదాచుకుంటున్న యువకులు

Update: 2022-12-10 05:25 GMT

మలేషియా కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న 80 మంది యువకులు

Malaysia: మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో 10 రోజులుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన 80 మంది యువకులు చిక్కుకున్నారు. ఉపాధి పేరుతో సరైన పత్రాలు లేకుండా విజిట్ వీసాలపై ఏజెంట్ జొన్నల రాజేశ్ పంపారు. దీంతో ఎయిర్‌పోర్టులో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ జిల్లా వాసులు చిక్కుకున్నారు.

టూరిస్ట్ వీసాతో పనిచేయవచ్చు అంటూ ఏజెంట్ పంపారు. ఈ వీసాలు పనిచేయవంటూ ఎయిర్‌పోర్ట్‌లో వీరందరినీ అధికారులు అడ్డగించారు. ఒక్కో యువకుడి నుంచి 80 వేల నుంచి లక్ష 20 వేల రూపాయల వరకు ఏజెంట్ వసూలు చేశారు. విజిటింగ్ వీసాపై మలేషియాకి వెళ్లగా, ఆ వీసాలను ఆ ప్రభుత్వం రద్దు చేసింది. మలేషియా చిక్కుకున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంబంధిత అధికారులతో, ఫోన్‌లో మాట్లాడారు. కౌలాలంపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ బీఎన్ రెడ్డితో కూడా ఎంపీ అర్వింద్ మాట్లాడారు. 

Tags:    

Similar News