Texas: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
Texas: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు సహా నలుగురు భారతీయులు మరణించారు.
Texas: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు సహా నలుగురు భారతీయులు మరణించారు. అమెరికా కాలమాణం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో వైట్ స్ట్రీట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆర్యన్ రఘునాథ్, లోకేశ్ పాలచర్ల, ఫరూక్ షేక్, దర్శిని వాసుదేవన్‌లు మృతిచెందారు. వీరిలో ఆర్యన్ రఘునాథ్, ఫరూక్ షేక్, లోకేశ్ పాలచర్లలు తెలుగువారు.
కార్ పుల్లింగ్ యాప్ ద్వారా డల్లాస్ నుంచి బెంటాన్ వెళ్లికి వీరంతా వెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ట్రక్కు అతివేగంతో వచ్చి వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం కావడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారాయి. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను అమెరికా పోలీసులు గుర్తించారు.
ఆర్యన్ రఘునాథ్ కుటుంబం రాయచోటి నుంచి కూకట్‌పల్లికి వచ్చి స్థిరపడింది. ఫరూక్ షేక్ ఫ్యామిలీ గుంటూరుకి చెందినవారుకాగా BHEL లో నివసిస్తుంది. వీరిద్దరిది 2024మేలోనే ఎంఎస్ పూర్తి కాగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బెంటన్‌విళ్లేకి వెళ్లేందుకు కార్‌పూలింగ్ యాప్ ద్వారా నలుగురు కనెక్ట్ అయ్యారు. బెంటన్‌విళ్లేలో నివాసం ఉంటున్న ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి డల్లాస్‌లోని తన బంధువు వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. లోకేశ్ పాలచర్ల తన భార్యను కలిసేందుకు వెళ్తుండగా... మామను చూసేందుకు దర్శిని వాసుదేవన్ పయనం అయ్యారు.
ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోవడంతో వేలిముద్రల ఆధారంగా మృతదేహాలను గుర్తిస్తున్నారు. వారాంతం కావడంతో మృతదేహాల గుర్తింపునకు ఆలస్యం జరిగింది. మృతదేహాల తరలింపు కోసం కేంద్రమంత్రి జైశంకర్ సహాయాన్ని కుటుంబసభ్యులు కోరుతున్నారు.