మధుమేహ వ్యాధిని షుగర్ వ్యాధి అని అంటారు. వ్యాధి మనిషికి ఉందో లేదో తెలుసుకునే లోగా చాపకింద నీరులా శరీరంలోకి చేరుతుంది. ఈ వ్యాధికి ముఖ్య కారణాలు మానవ శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గితే మధుమేహం వస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను కణాలు వినియోగించుకోకపోవడం వలన షూగర్ వస్తుంది. సాధారణంగా మధుమేహం ఏ వయస్సువారికైనా వస్తుంది. అధికంగా బరువు వారు, శారీరక శ్రమ లేని వారికి, కొన్ని సందర్భాల్లో వారసత్వంగా కూడా మధుమేహం వస్తుంది. అంతేకాకుండా తరచు జబ్బులతో బాధపడుతూ రోగనిరోధక శక్తిని కోల్పోయిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.భారతదేశంలో అత్యధిక శాతం మంది మధుమేహం బారిన పడుతున్నారు. నలుగురిలో ఒకరు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు. ఇంతవరకూ డయాబటిస్ నివారణకు సరైన మందు కనుగొనలేదు. దీనివల్ల ఎలాంటి భయం లేదు. మదుమేహాన్ని నియంత్రణలో ఉంచుకుని జీవితకాలాన్ని పొందవచ్చు. ఈ నెల14న ప్రపంచ డయాబెటిస్ డే సందర్భంగా ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం..
రకాలు :
డయాబెటిస్ మూడు రకాలుగా ఉంటుంది. మొదటిరకం టో ఇమ్యూనిటీ బీటా కణాలను మన దేహంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను నాశనం చేస్తుంది.
డయాబెటిస్‌లో రెండోరకం ఇది శరీరానికి బీటా కణాలు తట్టుకోలేనప్పుడు అధికంగా ఇన్సులిన్ కావాల్సి వస్తుంది. దీనిని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు.
డయాబెటిస్ టైప్ 1 చిన్న పిల్లల్లో అధికంగా కనిపిస్తుంది. ఇన్సులిన్ తయారీ తగ్గిపోవడంతో మధుమేహం వస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ ఇన్సులిన్ ఉత్పత్తి శరీరం ఉపయోగించుకోలేదు. ఈ రకం డయాబెటిస్ 90 శాతం మందిలో కనిపిస్తుంది.
జెస్టేషనల్ డయాబెటిస్ గర్భిణుల్లో కొంతమందికి ప్రసవం ముందు వస్తుంది
వ్యాధి లక్షణాలు:
1.ఈ వ్యాధి ఉన్నావారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది.
2. సాధారణంకన్నా ఎక్కువగా నీరు త్రాగడం
3. మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్ళడం
3. బరువు తగ్గడం, గాయం తగిలితే త్వరగా మానకపోవడం
4. స్త్ర్రీలలో అసాధారణంగా తెల్లబట్ట రావడం
5. కాళ్ళు ,చేతులు ముఖ్యంగా తిమ్మిరిగా వుండడం.
వంటి లక్షణాలలో ఈ వ్యాధి గ్రస్తులకు ఎక్కువగా ఉండడం జరుగుతుంది.
పాఠించాల్సిన జాగ్రత్తలు:
1. వీలైనంత త్వరగా ఈ వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి ఏ టైప్ డయాబెటిస్ అనేది నిర్ధారించుకోవలి.
2. ప్రతిరోజు 30 ని. నడవాలి, కనీసం వారంలో 5 రోజులు పాటు నడకవాలి
3. అధిక బరువులు ఎత్తడం లాంటివి చేయరాదు
4. క్రమం తప్పకుండా వైద్యం చేయించుకోవాలి.
5.ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలి
6. రాగులు, జొన్నలు, గోధుమలు, వంకాయ, బెండకాయ, దొండకాయ, మునగకాడలు, కాకర, ఆకుకూరలు, పొట్ల, కాబేజి, టమాటా, ఎక్కువగా తీసుకోవాలి
7. రాగి జావ ఉదయం పూట తాగాలి
8. సిగరేట్ మందు వంటి అలవాట్లు మానుకోవాలి
9. వైద్యులు సూచించిన విధంగా మందులు వేసుకోవాలి
మధుమేహ వ్యాధి వారు తినకూడని ఆహారం
1. బంగాళ దుంప, చామ దుంప మొ.
2. చాక్ లేట్లు, చక్కెర(పంచదార) తీపి పదార్ధాలు, పుడ్డింగులు
3. నూనెలో వేపిన పదార్ధాలు
4. ఎండు ద్రాక్ష, అంజీరా లాంటి డ్రైప్రూట్స్
5. సపోటా, అరటి పండు, సీతాఫలము, మామిడిపండ్లు