Lifestyle: నిలబడి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?

Lifestyle: ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తాగడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మనలో చాలా మంది నీటిని తాగే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.

Update: 2024-09-01 14:44 GMT

Lifestyle

Lifestyle: ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తాగడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిపడ నీరు తాగకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. డీహైడ్రేషన్‌ కారణంగా కిడ్నీ మొదలు శరీరంలో పలు భాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతీ రోజూ కచ్చితంగా 4 లీటర్ల నీటిని తీసుకోవాలి.

అయితే మనలో చాలా మంది నీటిని తాగే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. సాధారణంగా వేసిన తర్వాతే నీళ్లను తాగుతారు. అయితే దాహం వేయడానికి కంటే ముందే శరీరంలో నీటి శాతం తగ్గినట్లు అర్థం చేసుకోవాలి. శరీరంలో 1 శాతం నీరు లోటుగా ఉన్నా.. దాహం వేస్తుంది. లోటు 5 శాతానికి పెరిగితే రక్త నాళాలు సాగడం ప్రారంభించి శరీరంలో సత్తువ తగ్గిపోతుంది. అందుకే నీటిని ఎప్పటికప్పుడు నిపుణులు చెబుతుంటారు. ఇక మనలో చాలా మంది నిలబడి నీళ్లు తాగుతుంటాం. అయితే ఇలా తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ నిలబడి నీరు తాగితే జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిలబడి నీళ్లు తాగడం వల్ల దాహం పూర్తి స్థాయిలో తీరదని నిపుణులు చెబుతున్నారు. మళ్లీ మళ్లీ నీళ్లు తాగాలని అనిపిస్తుంది. అందుకే కూర్చొని నీళ్లు తాగడమే మంచిదని చెబుతున్నారు.

2. నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిలబడి నీరు తాగడం వల్ల నీరు వేగంగా కడుపు దిగువ భాగానికి చేరుకుంటుంది. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

3. నిలబడి నీళ్లు తాడం వల్ల కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కిడ్నీలపై భారం పడే అవకాశం ఉందని అంటున్నారు.

4. ఆరోగ్య నిపుణుల ప్రకారం నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులకు దారి తీస్తుందని అంటున్నారు. నిలబడి నీరు త్రాగడం వల్ల నరాలలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఇది శరీరంలోని ద్రవ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది కీళ్ల నొప్పులకు దారితీస్తుంది.

5. నిలబడి నీరు తాగడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిలబడి నీరు తాగితే.. ఆక్సిజన్ స్థాయి ప్రభావితమవుతుంది. ఇది ఊపిరితిత్తుల నుంచి గుండె వరకు ప్రతిదానిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

Note: ఈ వివరాలు ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా అందించినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News