కొన్ని వినడానికి ఆశ్చర్యంగా ఉంటాయి. చెప్పుకోవడానికి ఇబ్బందిగానూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా వైరస్ కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. కరోనా వచ్చేసింది.. మరణానికి జనం సిద్ధం అయిపోవాల్సిందే. ఇలాంటి వార్తలు వరుసగా వింటూ వస్తున్నాం. ఇక కరోనా ఎలా వస్తుంది.. ఎలా వ్యాపిస్తుంది.. నివారణ ఎలా.. ఎదుర్కోవడం ఎలా? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వార్తలు ఇప్పటికే అన్ని మీదియాల్లోనూ వ్యాప్తిలో ఉన్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ గురించిన కొత్త విషయం ప్రచారంలోకి వచ్చింది.
కరోనా అపాన వాయువు ద్వారా కూడా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉందనేది ఆ వార్త. సాధారణంగా అపాన వాయువు ద్వారా ఒక్కోసారి వచ్చే భరించరాని దుర్వాసన తోనే ఇబ్బంది అని ఇప్పటివరకూ అందరికీ తెలుసు. అయితే, వ్యాధులు లేదా వైరస్ సంక్రమిస్తుండానే విషయం కొంత ఆశ్చర్యాన్ని కలిగించేదే కాకుండా ఆందోళన కలిగించే విషయంగానే చెప్పుకోవాలి.
ఫిబ్రవరి 23 వ తేదీన గ్లోబల్ టైమ్స్ వెబ్ సైట్ లో ప్రచురించిన కథనం ప్రకారం అపానవాయువు ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందట. చైనా లోని బీజింగ్టాం జిల్లా కు చెందినా టాంగ్ ఝు లోని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీదీసీ) వుయ్ చాట్ లో ప్రచురించిన ఒక ఆర్టికల్ ను ఊతంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సమాచారం ప్రకారం కరోనా సోకిన వ్యక్తి వదిలే అపానవాయువుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందట. అయితే, పాంట్ తొడుక్కుని ఆ రోగి ఉంటె కనుక వైరస్ ను పాంట్ అడ్డుకుంటుందనీ, అందువల్ల బయట గాలిలోకి వచ్చే అవకాశం ఉండదనీ ఆ ఆర్టికల్ లో తెలిపారు. అదేవిధంగా ప్యాంట్ వేసుకొని కరోనా సోకినా రోగికి దగ్గరలో ఉన్నవారికే ఈ అపానవాయువు ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశముందని వెల్లడించారు.
ఇంకా, ఈ విధమైన నిర్ణయానికి టాంగ్సీ ఝూ సీడీసీ రావడానికి వెనుక పలు పరిశోధనలు ఉన్నట్టు ఆ కథనంలో పేర్కొన్నారు. చైనాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వుయ్ చాట్లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ విషయంలో పలు పరిశోధనలు జరిగాయని చెప్పారు. తాజాగా చైనా ప్రఖ్యాత మెడికల్ అడ్వైజర్ ఝాంగ్ నాన్షణ్ కరోనా వైరస్ సోకినా వారి నుంచి తీసుకున్న మల, మూత్ర శాంపిల్స్ ను విస్తృతంగా పరిశోధనలు చేసిన తరువాత అపాన వాయువు ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందనే నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు.
ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే అని ఆ కథనం పేర్కొంది. ఇక ఈ విషయం తెలుసుకున్న చైనీయులు ముఖానికి వాడె ఎన్95 రకం మాస్క్ ను తమ వెనుక భాగంలో ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, పాంట్లు ఉపయోగిస్తున్న వారితో ఏ ఇబ్బందీ ఉండదని చైనా అధికారులు చెబుతున్నారు. ఈ విషయం పై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఏది ఏమైనా అపానవాయువు తో కరోనా వ్యాపించడం అనే వార్తా ఆందోళన కలిగించే అంశమే. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.
గ్లోబల్ టైమ్స్ ఇచ్చిన కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://www.globaltimes.cn/content/1180514.shtml