కరోనా సోకితే గుండెకు ముప్పు

కరోనా సోకిన తర్వాత గుండెకు ముప్పు ఏర్పడుతుందని ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది.

Update: 2020-03-30 13:56 GMT
Representational Image

కరోనా సోకిన తర్వాత గుండెకు ముప్పు ఏర్పడుతుందని ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఎటువంటి గుండే జబ్బులు లేకపోయినా అలాగే, హృదయ సంబంధ సమస్యలు ఉన్న ఈ కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారుతుందని హ్యూస్టన్‌లోని టెక్సాస్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ అధ్యయనంలో తేలింది.

కోవిడ్ సోకడంతో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమై, ఊపిరితిత్తుల దెబ్బతిని మరణానికి కూడా దారితీస్తాయి. కాకపోతే కరోనా వైరస్ హృదయనాళ వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో ఇంకా కచ్చితమైన సమాచారం లేదు.

గుండె సంబంధించిన సమస్యలు లేకపోయినా.. కరోనా సోకిన తర్వాత హృదయ కండరాలు ప్రభావితం అవుతుందని పరిశోధనలో పాల్గొన్న టెక్సాస్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మొహమూద్ మజీద్ పేర్కొన్నారు.

కరోనా వైరస్ సోకితే గుండె సంబంధ సమస్యలున్నవారికి మాత్రం ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ వైరస్ వలన అధిక రక్తపోటు ఉన్న వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్లిష్టమైన కేసుల్లో శరీరంలో అవయవాలు పనిచేయకపోవడం, శ్వాసవ్యవస్థ వైఫల్యం కారణాలు మరణానికి దారితీస్తాయని అధ్యయనంలో వివరించారు.

ఇన్‌ఫ్లూయాంజా లాంటి వ్యాధులు సోకితే మాత్రం తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల కరోనరీ సిండ్రోమ్స్, ఎరిథ్మియా, గుండె జబ్బులకు దారితీస్తాయని పరిశోధన బృందం వెల్లడిచింది. అమెరికా కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా వైరస్ సోకి మరణించిన వారిలో కార్డియోవాస్క్యూలర్ వల్ల ప్రాణాలు కోల్పోయినవారి 10.5 శాతమని తేల్చింది.

కరోనా వైరస్ బారినపడితే గుండె సంబంధ సమస్యలకు దారితీస్తుందని, హృద్రోగాలు లేని వారు గుండె కండరాలు దెబ్బతింటే ఇక అప్పటికే ఉన్నవారిలో సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తోందని భావించడం సహేతకమైందని డాక్టర్ మజీద్ చెప్పారు. 

Tags:    

Similar News