సామాన్యులకు జీఎస్టీ నుంచి కాస్త ఊరట కల్గింది. జీఎస్టీ పరిధిలోని వస్తువుల పన్ను రేట్లలో స్వల్ప మార్పులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 33 రకాల వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గింది. 28 శాతం జీఎస్టీ ఉన్న సుమారు ఏడింటిని 18 శాతం శ్లాబులోకి తీసుకు వచ్చింది. మరో 26 వస్తువులను 18 శాతం శ్లాబు నుంచి 12 శాతం, 5 శాతం శ్లాబులకు మార్చాలని జీఎస్టీ సమావేశంలో నిర్ణయించారు. 28 విలాస వసంతమైన వస్తువులపై జీఎస్టీ వసూల్లో మార్పు లేదు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి అధ్యక్షతన జరిగిన 31వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 33 వస్తువులపై 18 శాతం నుంచి 12 శాతం, 5 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ తగ్గించారు. ఏడు రకాల వస్తువులపై 28 శాతం నుంచి 18 శాతం పన్ను తగ్గింపు. విలాస వంతమైన వస్తువులపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 28 శాతం జీఎస్టీ యథాతధంగా ఉంటుంది. జన్‌ధన్ ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు కల్పించారు.
32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీలు, వీడియోగేమ్స్‌పై 28% నుంచి 18% పన్ను తగ్గించారు.100 రూపాయల ధర ఉండే సినిమా టికెట్‌పై 12 శాతం. వంద రూపాయల కన్నా ఎక్కువ ఉన్న టికెట్ ధరలను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. కంప్యూటర్ మానిటర్లు, టీవీ స్క్రీన్లు, టైర్లు, పవర్ బ్యాంకులు, లిథియమ్ బ్యాటరీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. విమానం టికెట్లు ఎకానమీ క్లాసుపై 5శాతం, బిజినెస్ క్లాసుపై 12శాతం జీఎస్‌టీ వసూలు చేయనున్నారు. దివ్యాంగులు వాడే పరికరాలపై 5 శాతం పన్ను వసూలు చేయనున్నారు. సిమెంట్‌పై జీఎస్‌టీ 18 శాతానికి కోతపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారికి నిరాశే మిగిలింది. రియల్ ఎస్టేట్ పై వచ్చే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆటో, సిమెంట్‌పై పన్నులు తగ్గిస్తే కేంద్రంపై 40 వేల కోట్ల భారం పడుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో పన్నులపై ప్రత్యేక బృందం పరిశీలిస్తుందన్నారు. 2019 జనవరి ఒకటి నుంచి కొత్త జీఎస్టీ విధానం అమలులోకి వస్తుందని జైట్లీ తెలిపారు.
ఈ సమావేశానికి వివిధ రాష్టాలకు చెందిన మంత్రులు హాజరు కాగా తెలంగాణ నుంచి ఆర్దిక శాఖ అధికారులు హాజరయ్యారు.