UGC Net 2022: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేసుకోవడానికి చివరి తేది ఎప్పుడంటే..?
UGC Net 2022 యూజీసీ నెట్ నోటిఫికేషన్ 2022 విడుదలైంది...
UGC Net 2022: యూజీసీ నెట్ నోటిఫికేషన్ 2022 విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2021డిసెంబర్, 2022 జూన్ రెండింటికిగానూ ఒకే నోటిఫికేషన్‌ను జారీచేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. యూజీసీ నెట్‌లో మంచి స్కోర్ సాధిస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (Junior Research Fellowship), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్టులకు పోటీపడే అవకాశముంటుంది.
మొత్తం 82 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఎగ్జామ్‌కు సంబంధించి అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్, పరీక్షా తేదీలను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. ఆయా తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ తన వెబ్‌సైట్‌లో సూచించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్‌ఎఫ్‌కు ప్రతి ఏడాది రెండు సార్లు యూజీసీ నెట్ నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల ఆలస్యంగా నిర్వహించారు. తద్వారా డిసెంబర్ 2021, జూన్ 2022 ఎంట్రన్స్‌ను కలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారు.
ఇలా దరఖాస్తు చేసుకోండి:
1. మొదట యూజీసీ అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in/ ను ఓపెన్ చేయాలి.
2. హోం పేజీలో కనిపించే యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 లింక్ మీద క్లిక్ చేయాలి
3. అనంతరం న్యూ రిజిస్ట్రేషన్ (New Registration) మీద క్లిక్ చేసి మొదటగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
4. రిజిస్టర్ అయిన తరువాత అభ్యర్థులు Application Number, Password ఎంటర్ చేసి కింద కనిపించే సెక్యూరిటీ పిన్ నమోదు చేసి సైన్ ఇన్ కావాలి.
5. తర్వాత అభ్యర్థి వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
6. అనంతరం క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఏదైనా విధానంలో ఫీజు చెల్లించి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.