TS Model School Admissions 2025: టీఎస్ మోడల్ స్కూల్ అడ్మిషన్లు.. ఆన్ లైన్ అప్లికేషన్స్ షురూ..ప్రాసెస్ ఇదే

Update: 2025-01-11 01:22 GMT

TS Model School Admissions 2025: తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పించనున్నారు. ఎంట్రన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఆరవ తరగతిలో కొత్తగా ప్రవేశం కల్పించడంతోపాటు 7వ, 10వ తరగతిలో ఖాళీ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు.

మోడల్ స్కూల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ఓసీ విద్యార్థిలు రూ. 200 చెల్లించాలి. ఇక బిసి, ఎస్సి, ఎస్టి, దివ్యాంగ, ఈ డబ్ల్యూ ఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాలి. రాత పరీక్ష ఏప్రిల్ 13వ తేదీ 2025న జరుగుతుంది. హాల్ టికెట్లు ఏప్రిల్ 3వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే?

* ముందుగాhttps://telanganams.cgg.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లాలి.

*హోమ్ పేజీలో Notification -TGMS VII TO X CLASS -2025 ఆప్షన్ కనిపిస్తుంది. వీటికి చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ లింక్ డిస్ప్లే అవుతుంది.

* ముందుగా నిర్ణయించిన అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

* ఆ తర్వాత ఆన్లైన్ దరఖాస్తు పై క్లిక్ చేస్తే మీకు దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.

* మీ వివరాలను ఎంట్రీ చేసిన తర్వాత చివరిలో సబ్మిట్ నొక్కితే ప్రాసెస్ పూర్తి అవుతుంది.

* చివరిలో ప్రాసెస్ పూర్తయ్యాక ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కాపీని తీసుకోవచ్చు.

* రిజిస్ట్రేషన్ నెంబర్ను గుర్తుపెట్టుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఇది ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News